నేనేమైనా ప్రియాంక చోప్రానా? కుర్రాడిని బుట్టలో వేసుకోని పెళ్లి చేసుకోవడానికి..!
హిందీ సినిమా పరిశ్రమలో శృంగార తారల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన వారిలో రాఖీ సావంత్ ఒకరు. వెండితెరపైకి వచ్చిన సమయంలో విపరీతమైన క్రేజ్ కనిపించినా.. దానిని పాజిటివ్‌గా మార్చుకోవడంలో విఫలమయ్యారు. దాంతో ఆమె ఎంచుకొన్న ప్రతీ విషయంలో వైఫల్యాలే కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. లైఫ్ అనేక ప్రతికూలతలను ఎదుర్కొన్నప్పటికీ.. తనలోని ఆత్మ విశ్వసాన్ని పొగొట్టుకొన్నట్టు ఎక్కడా కనిపించదు. ఇటీవల బాలీవుడ్ మీడియా ఫిల్మీ గ్యాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మూడో పెళ్లి గురించి ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. రాఖీ సావంత పర్సనల్, ప్రొఫెషనల్ విషయాల్లోకి వెళితే..
ముంబైలో జన్మించిన రాఖీ సావంత్ అసలు పేరు నీరూ బేడా. ఆనంద్ సావంత్ అనే అతడిని తల్లి జయ రెండో పెళ్లి చేసుకోవడంతో ఆమె పేరు కూడా మార్చుకొన్నది. మారుతండ్రి సావంత్ పేరు తీసుకొని తన పేరును రాఖీ సావంత్‌గా మార్చుకొన్నది. 1997 సంవత్సరంలో అగ్నిచక్ర అనే చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చుడేల్ నంబర్ 2, జోరు కా గులాం, జిస్ దేశ్ మే గంగా రహ్తా హై, 6 టీన్స్ చిత్రాల్లో నటించారు. 2023 సంవత్సరంలో మస్త్ మే రహనే కా అనే చిత్రంలో చివరిసారిగా నటించారు.

అయితే అరకొర ఆఫర్లతో సినిమాల్లో నటిస్తూనే రితేష్ సింగ్ అనే ఎన్నారైని 2019 సంవత్సరంలో పెళ్లి చేసుకొన్నది. ఆ తర్వాత 2022 సంవత్సరంలో విడాకులు తీసుకొన్నది. ఆ తర్వాత ఆదిల్ ఖాన్ దురానీ అనే వ్యాపారవేత్తను 2022 సంవత్సరంలోనే పెళ్లి చేసుకొన్నది. కానీ అది కూడా ఎక్కువ కాలం సాగలేదు. ఫిబ్రవరి 2023 సంవత్సరంలో సపరేట్ అయ్యారు. అలా రెండు పెళ్లిళ్లు విఫలం కావడంతో తన ఫోకస్‌ను రాజకీయాల వైు పెట్టారు.
పెళ్లికి ముందే రాఖీ సావంత్ 2014 సంవత్సరంలో మహారాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా లో చేరిన ఆమె ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైంది. ఆ తర్వాత రాజకీయాల్లో కూడా ప్రభావం చూపలేకపోవడంతో ఆమె క్రీయాశీలక రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. దాదాపు 3 సంవత్సరాల పాటు ముంబై పాలిటిక్స్‌లో హడావిడ చేశారు.
రాఖీ సావంత జీవితం అంతా గందరగోళమే. రకరకాల వివాదాలతో ఆమె లైఫ్‌ను లీడ్ చేస్తుంది. మికా సింగ్‌తో ముద్దు వివాదం సంచలనం రేిపంది. బిగ్‌బాస్‌లో కూడా టాప్ 4 కంటెస్టెంట్‌గా రాణించింది. కానీ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. బాలీవుడ్‌లో ముక్కు సూటిగా, కుండబద్దలు కొట్టిన మాట్లాడుతూ కాంట్రవర్సీలకు అడ్డాగా మారిన ఆమె తన మూడో పెళ్లిపై ఘాటుగా స్పందించింది.
దాదాపు 50 ఏళ్లకు చేరువ అవుతు్న రాఖీ సావంత్ ఇటీవల పెళ్లి గురించి మాట్లాడుతూ.. తన వయసుకు తగ్గిన వరుడు దొరకడం లేదు. తన వయసులో సగం వయసు ఉన్న వాళ్లే ఎదురు పడుతున్నారు. నేను ఏమైనా ప్రియాంక చోప్రానా, తన కంటే సగం వయసు ఉన్న కుర్రాడు నిక్ జోనస్‌ను బట్టలో వేసుకొని పెళ్లి చేసుకోవడానికి. నా కంటే 5, లేదా 6 ఏళ్ల వయసు తక్కువగా ఉన్న నేను పెళ్లి చేసుకోవడానికి రెడీ.


Click it and Unblock the Notifications