కలకలం రేపిన రాఖీ సావంత్.. మోదీ జీవితం నాశనం చేశారంటూ కామెంట్స్!
రాఖీ సావంత్‌ను కాంట్రవర్సీ క్వీన్ అని పిలుస్తారు. ఆమె ఎప్పుడు ఏమి మాట్లాడుతుందో, ఎవరి గురించి మాట్లాడుతుందో ఎవరూ ఊహించలేరు. ఇప్పుడు ఆమె తన జీవితాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నాశనం చేశారని మీడియా ముందు ఆరోపించింది. ఆమె చెబుతున్న దాని ప్రకారం, ఆమె రెండు రాత్రుల నుంచి నిద్ర పోలేదట. అంతేకాదు ఆమె బూస్టర్ డోస్‌ను కామ ఇంజెక్షన్ అని అభివర్ణించింది. మోడీ గురించి, బూస్టర్ డోస్ గురించి రాఖీ ఏం చెప్పిందో చదవండి.

నిద్ర పట్టడం లేదు
సోమవారం ముంబై విమానాశ్రయంలో రాఖీ సావంత్ కనిపించింది. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ఫొటోగ్రాఫర్లతో ఆమె మాట్లాడుతూ.. 'మోదీ జీ.. నా జీవితాన్ని నాశనం చేశారు.. రెండు రాత్రులు నిద్రపోలేదు.. బూస్టర్ డోస్ వేసినప్పటి నుంచి నిద్ర పట్టడం లేదు.. నా శరీరం మొత్తం ఏమి అడుగుతుందో కూడా నాకు తెలియదు. నేను కలత చెందానని అంటూ ఆమె కామెంట్ చేసింది.

లేవలేని వారు
రాఖీ ఇంకా మాట్లాడుతూ, "శరీరంలో ఏమి జరుగుతుందో తెలియదు, నా ముఖం వాచిపోయి ఉంది. నాకు నిద్ర రావడం లేదు. నాకు అరగంట కూడా నిద్ర పట్టడం లేదు. నేను చాలా దారుణమైన స్థితిలో ఉన్నాను. నేను ఈ బూస్టర్ ఇంజెక్షన్ 60, 70, 80, 90 సంవత్సరాల వయస్సు గల వారికి ఇవ్వాలి అని భావిస్తున్నాను. లేవలేని వారు, వారు మాత్రమే దానిని తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు.

ముఖం ఇలా మారి
రాఖీ ఇంకా మాట్లాడుతూ "ఈ బూస్టర్ ఇంజెక్షన్ వల్ల నాకు నిద్ర పట్టదు, నాకు పిచ్చి పట్టింది. ఆదిల్ కోసం వెతుకుతున్నాను. ఆదిల్ ఎక్కడ ఉన్నాడు? నేను ఈ రోజు ఆదిల్‌ని కలవబోతున్నాను. ఈ బూస్టర్ నన్ను ఏమి చేసిందో మీరు అర్థం చేసుకోవచ్చు అంటూ ఆమె పిచ్చి పిచ్చిగా మాట్లాడి రచ్చ లేపింది. రాఖీ ఇంకా మాట్లాడుతూ, "మోదీ జీ, ఈ ఇంజెక్షన్ ఏమిటి? ఇందులో ఎన్ని జంతువులు ప్రమేయం ఉన్నాయో నాకు తెలియదు. నేను నిద్రపోతున్నా నా కళ్ళు తెరిచే ఉంటున్నాయి, అందుకే నా ముఖం ఇలా మారింది అని పేర్కొన్నారు.

వయాగ్రా అని
ఇది షిలాజిత్, వయాగ్రా అని లస్ట్ ఇంజెక్షన్ రాఖీ పేర్కొంది. అంతేకాదు మీరు ఈ కాలంలో బూస్టర్ డోస్ వేయించు కోకండి అంటూ ఫోటోగ్రాఫర్లకు రాఖీ సూచించింది. 60 ఏళ్లు పైబడిన నడవలేని వారి కోసమే ఈ బూస్టర్ డోస్ అని రాఖీ తెలిపింది "ఇది లోపల మంటలను రేకెత్తిస్తుంది. దానిని ఎలా చల్లార్చాలో కూడా నాకు తెలియదని ఆమె పేర్కొన్నారు. రాఖీ సావంత్ రెండు రోజుల క్రితం బూస్టర్ డోస్ వేయించుకున్నారు, దాని వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

అధికారిక ప్రకటన
ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీని ఈ విషయంలో రాఖీ విమర్శిస్తోంది. నటి రాఖీ సావంత్ తన ప్రియుడు ఆదిల్ తో డేటింగ్ ప్రారంభించారు. ప్రతి పార్టీలోనూ ఇద్దరూ కలిసి కనిపిస్తున్నారు. రాఖీ ఆదిల్‌తో తన అనుబంధాన్ని పూర్తిగా ఆస్వాదిస్తోంది. ఇద్దరూ పెళ్లికి కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే దీనిపై రాఖీ కానీ, ఆదిల్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటనా ఇవ్వలేదు.


Click it and Unblock the Notifications











