ప్రేమికుల దినోత్సవానికి ఒకరోజు ముందు షాకిచ్చిన హాట్ బాంబ్.. భర్త రితేష్ కి గుడ్ బై!
ఈ మధ్య కాలంలో చాలా బ్రేకప్ వ్యవహారాలు సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి. ప్రేమలో ఉన్న వారు విడిపోయిన దాఖలాలు కొన్ని అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు కూడా విడిపోయిన దాఖలాలు మరికొన్ని. ఇప్పుడు సరిగ్గా ప్రేమికుల దినోత్సవానికి ఒక్క రోజు ముందు షాకింగ్ ప్రకటన చేసిన బాలీవుడ్ హాట్ బాంబ్ గా పేరు తెచ్చుకున్న రాఖీ సావంత్. ఆమె తన భర్తతో విడిపోతున్నట్టు ప్రకటించింది. ఆ వివరాలు

ఇలేష్ పరుంజ్వాలాతో నిశ్చితార్థం
వినోద ప్రపంచంలో డ్రామా క్వీన్‌గా ఫేమస్ అయిన రాఖీ సావంత్ ప్రతిరోజూ ఏదో ఒక సంఘటన కారణంగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. రాఖీ సావంత్ తన కఠోర శ్రమతో ఇండస్ట్రీలో స్థానం సంపాదించుకుంది. రాఖీ సావంత్ 2009లో స్వయంవరాన్ని ఏర్పాటు చేసుకుంది. ఒక రియాలిటీ షోలో ఆమె తన భాగస్వామిని ఎంచుకుంది. రాఖీ ఎన్నారై ఇలేష్ పరుంజ్వాలాతో నిశ్చితార్థం కూడా చేసుకుంది, అయితే తర్వాత రాఖీ విడిపోయింది. డబ్బు కోసమే రాఖీ ఈ నిశ్చితార్థం చేసుకున్నారని, ఆ విషయాన్ని కూడా తర్వాత వెల్లడించింది.

దీపక్ కలాల్ పెళ్లి
ఆ తరువాత రాఖీ సావంత్ 2018లో దీపక్ కలాల్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. వివాహ తేదీని 31 డిసెంబర్ 2018న ఖరారు చేసింది. మరియు వివాహ వేదికను లాస్ ఏంజెల్స్‌లో నిర్ణయించారు. అంతే కాదు లైవ్ హనీమూన్ జరుపుకోనున్నట్టు రాఖీ ప్రకటించింది. అయితే ఈ పెళ్లి జరగలేదని, ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ అని తేలిపోయింది. ఆ తరువాత రాఖీ సావంత్ డ్యాన్సర్ అభిషేక్ అవస్థితో మూడేళ్ల పాటు ఎఫైర్ నడిపింది. అయితే రాఖీ 2019లో ఎన్నారై రితేష్‌ని పెళ్లాడింది. కానీ బిగ్ బాస్ 15కి ముందు రాఖీ భర్త రితేష్‌ను ఎవరూ చూడలేదు. అయితే బిగ్ బాస్ నుంచి రాఖీ బయటకు రాగానే.. తాను రితేష్‌ను చట్టబద్ధంగా పెళ్లి చేసుకోలేదని చెప్పింది. రితేష్‌కి అప్పటికే పెళ్లయింది. రితేష్ మొదటి భార్య పేరు స్నిగ్ధ. స్నిగ్ధ తరువాత మీడియా ముందుకు వచ్చి అనేక ఆరోపణలు చేసింది.

రితేష్ నుండి విడిపోతున్నట్లు
బహుశా అందుకోనేమో రాఖీ సావంత్ తన పెళ్లి వార్తను, రితేష్‌తో ఆమె సంబంధం చాలా రహస్యంగా ఉంది. సోషల్ మీడియా ద్వారా సస్పెన్స్ క్రియేట్ చేస్తూ రాఖీని మరింత మిస్టరీగా మార్చేసింది. అయితే బిగ్ బాస్ 15లో తొలిసారిగా రాఖీ భర్త రితేష్ జనాల ముందుకు వచ్చాడు. అయితే ఇప్పుడు ఈ బంధం కూడా ముగిసిపోయింది. ఈ విషయాన్నీ స్వయంగా రాఖీ సావంత్ షేర్ చేసింది. రాఖీ సావంత్ తన భర్త రితేష్ నుండి విడిపోతున్నట్లు ప్రకటించింది. ఈ సమాచారాన్ని ఆమె తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

విడివిడిగా గడపాలని
బిగ్ బాస్ తర్వాత, ఈ జంట రిలేషన్‌షిప్‌లో చాలా సమస్యలు మొదలయ్యాయట. ఇద్దరూ దాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించారు కానీ పరిస్థితులు అనుకూలించక పోవడంతో ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. రాఖీ 'ప్రియమైన అభిమానులారా, నేను మరియు రితీష్ ఒకరినొకరు విడిపోయామని మీకు చెప్పాలనుకుంటున్నాను. 'బిగ్ బాస్' తర్వాత చాలా జరిగాయి మరియు చాలా విషయాలు నా నియంత్రణలో లేవు. మేమిద్దరం చాలా ప్రయత్నించాము, కాని చివరికి మా ఇద్దరి జీవితాలను విడివిడిగా గడపాలని నిర్ణయించుకున్నాము.' అని పేర్కొనన్నారు.
Recommended Video

చాలా బాధగా ఉంది
అలాగే రాఖీ వాలెంటైన్స్ డేకి ఒక రోజు ముందు ఇదంతా జరగడం నాకు చాలా బాధగా ఉంది. అయితే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. రితీష్ భవిషత్తు బాగానే ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ సమయంలో నేను నా పనిపై దృష్టి పెట్టాలి, నన్ను సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉంచుకోవాలి. నన్ను అర్థం చేసుకున్నందుకు మరియు మద్దతు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అంటూ పేర్కొంది.


Click it and Unblock the Notifications











