తనుశ్రీ దత్తా లైంగిక వేధింపుల వివాదం: నా ముందుకు రావాలంటూ రాఖీ సవాల్!
బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా ప్రముఖ నటుడు నానా పాటేకర్ మీద చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలన అయిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో కొందరు నానా పాటేకర్‌కు మద్దతుగా మాట్లాడుతుండగా...మరికొందరు తనుశ్రీ దత్తను సపోర్ట్ చేస్తున్నారు.
పదేళ్ల క్రితం 'హార్న్ ఓకే ప్లీజ్' అనే సినిమా షూటింగ్ సమయంలో నానా పాటేకర్ తనతో మిస్ బిహేవ్ చేశాడని, సెట్స్‌లో అందరి ముందే లైంగికంగా వేధించాడంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనుశ్రీ దత్తా ఆరోపించారు.

తాజాగా ఈ వివాదంపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ రాఖీ సావంత్ స్పందించారు. ఈ ఇష్యూలో ఆమె నానా పాటేకర్‌కు మద్దతుగా మాట్లాడుతూ తనుశ్రీ దత్తా వ్యవహారాన్ని తప్పుబట్టారు. నానా పాటేకర్ చాలా మంచి వ్యక్తి, ఆయన ఎవరితోనూ మిస్ బిహేవ్ చేసే రకం కాదు, మహిళలకు గౌరవం ఇచ్చే వ్యక్తి, ఒక గొప్ప నటుణ్ని తనుశ్రీ దత్తా అవమానిస్తోందంటూ రాఖీ సావంత్ మండి పడింది.
తనుశ్రీ దత్తా మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తోందని, అందుకే తన పబ్లిసిటీ పెంచుకోవడానికి నానా పాటేకర్ లాంటి ఒక మంచి వ్యక్తి మీద లేనిపోని ఆరోపణలు చేస్తోందని రాఖీ ఆరోపించారు. తనుశ్రీ ఇంగ్లీష్‌లో బాగా మాట్లాడుతోంది కాబట్టి ఆమెపై మీడియా ఎక్కువ ఫోకస్ పెట్టిందన్నారు.
తనుశ్రీ దత్తా చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉందని తాను నమ్మడం లేదన్న రాఖీ సావంత్... నిజంగా ఆమె చేసిన ఆరోపణలు నిజమైతే నా ముందుకు వచ్చి మాట్లాడాలంటూ ఛాలెంజ్ చేశారు.


Click it and Unblock the Notifications











