హీరోయిన్‌తో నటుడి అసభ్య ప్రవర్తన.. పబ్లిక్‌లో బలవంతంగా ముద్దు..

ఐటెం సాంగ్స్‌తోనే హీరోయిన్లను మించిన క్రేజ్ తెచ్చుకున్నారు బాలీవడ్ హాట్ బాంబ్ రాఖీ సావంత్. తన అందం, డ్యాన్సింగ్ స్కిల్స్‌తో కుర్రాళ్లకు సెగలు రేపారు. సినిమాలతో కంటే వివాదాలు, వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచారు రాఖీ. ఒకప్పుడు ఆమె ఏం మాట్లాడినా, ఏం చేసినా వైరల్ అయ్యేది. దాంతో మీడియా కూడా రాఖీ సావంత్‌పై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచేది. అయితే ఇప్పుడు ఆమె అడ్రస్ లేకుండా పోయారు.

Also Read
'పెద్ది సినిమా అయినా డోంట్ కేర్.. మెగాస్టార్ చిరంజీవి పిలిచినా..’
'పెద్ది సినిమా అయినా డోంట్ కేర్.. మెగాస్టార్ చిరంజీవి పిలిచినా..’

రాఖీ అసలు పేరు నీరూ భేడా.. 1997లో అగ్నిచక్ర అనే సినిమాతో హిందీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తొలుత చిన్నా చితకా పాత్రలు, ఐటెం సాంగ్స్‌తో సత్తా చాటింది రాఖీ. జోరు కా గులాం, జిస్ దేశ్ మైనే గంగా రహతా హై తదితర సినిమాలలో నటించింది. అయితే 2003లో చారు లియా హై తుమ్నే సినిమాతో రాఖీకి మంచి పేరొచ్చింది. అనంతరం మస్తి, మై హూ నా, క్రేజీ 4, దిల్ బోల్ హదిప్ప తదితర చిత్రాలలో నటించింది. బిగ్‌బాస్ హిందీ లాంచింగ్ సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న రాఖీ సావంత్.. తిరిగి 2020లో బిగ్‌బాస్ 14లో ఫైనలిస్ట్‌గా నిలిచారు.

Rakhi Sawant Recalls Mika Singh Kiss Controversy After 20 Years

అప్పట్లో మీటూ ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడి వార్తల్లో నిలవడంతో పాటు తనుశ్రీ దత్తాతో వివాదానికి దిగింది. అలాగే నేను పెళ్లి చేసుకుంటా ఎవరైనా ఉన్నారా అంటూ స్వయంవరం కూడా నిర్వహించింది. అయితే స్వయంవరంలో గెలిచిన వారికి షాకిస్తూ తూచ్ అనేసింది. బిగ్‌బాస్‌లోకి వెళ్లొచ్చిన తర్వాత ఆమె ఫాలోయింగ్ మరింత పెరిగింది. అలాగే ఆమె వ్యక్తిగత జీవితం కూడా వివాదాలమయం. తొలుత వ్యాపారవేత్త రితేష్ సింగ్‌ని పెళ్లి చేసుకున్న రాఖీ ఆయనకు విడాకులు ఇచ్చింది. అనంతరం కర్ణాటకకు చెందిన వ్యాపారి అదిల్ ఖాన్ దురానీని సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి కూడా ఎక్కువ కాలం నిలవలేదు. అంతేకాదు.. అదిల్ తనను మోసం చేశాడని, నా డబ్బును అనుమతి లేకుండా వాడుకుంటున్నాడని కేసు పెట్టింది. కొన్నాళ్లు జైళ్లో ఉన్న అదిల్.. అనంతరకాలంలో బిగ్‌బాస్ 12 కంటెస్టెంట్‌ సోమిఖాన్‌ను పెళ్లాడారు

Recommended For You
ఆ హీరోని కిస్ చేయాలని ఉంది.. అలా ఓపెన్ అయిన బిగ్‌బాస్ బ్యూటీ
ఆ హీరోని కిస్ చేయాలని ఉంది.. అలా ఓపెన్ అయిన బిగ్‌బాస్ బ్యూటీ

2014లో రాజకీయాల్లోకి దిగిన రాఖీ సావంత్ స్వయంగా రాష్ట్రీయ ఆమ్ పార్టీ (ఆర్ఏపీ)ని స్థాపించారు. ఆ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ముంబై నార్త్ వెస్ట్ స్థానం నుంచి బరిలో నిలిచి కేవలం 15 ఓట్లు మాత్రమే పొంది డిపాజిట్ కోల్పోయింది. దాంతో రాష్ట్రీయ ఆమ్ పార్టీకి రాజీనామా చేసి ఆర్‌పీఐ (అథవాలే)లో చేరింది రాఖీ. ఆ పార్టీ తరపున అస్సాం, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీల ఎన్నికల్లో ప్రచారం చేసింది. అయితే రాఖీ సావంత్ కెరీర్‌లో మికా సింగ్‌తో ముద్దు కేసు సంచలనం సృష్టించింది.

You May Also Like
'నేనేమీ బ్రేక్ తీసుకోలేదు.. అలా సినిమాలకు దూరమయ్యా’
'నేనేమీ బ్రేక్ తీసుకోలేదు.. అలా సినిమాలకు దూరమయ్యా’

2006 జూన్ 11న ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో బర్త్ డే పార్టీకి రాఖీ సావంత్ హాజరైంది. అదే పార్టీకి మికా సింగ్ కూడా వచ్చారు. పార్టీ ముగించుకుని బయటకు వస్తుండగా రాఖీని మికా సింగ్ బలవంతంగా ముద్దు పెట్టుకోవడంతో ప్రజలు, మీడియా అంతా షాకయ్యారు. తన అనుమతి లేకుండా ముద్దు పెట్టుకోవడంపై రగిలిపోయిన రాఖీ.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పలు సెక్షన్ల కింద మికా సింగ్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. వీడియో ఫుటేజ్, స్టిల్ కెమెరాలలోని ఫోటోలు కేసులో కీలకంగా మారాయి.

'వాళ్లతో కొట్లాడేంత డబ్బు లేదు.. నేను చనిపోయినా ఆ ఫోటోలు షేర్ చేయొద్దు’
'వాళ్లతో కొట్లాడేంత డబ్బు లేదు.. నేను చనిపోయినా ఆ ఫోటోలు షేర్ చేయొద్దు’

దాదాపు 17 ఏళ్ల పాటు న్యాయస్థానంలో ఈ కేసుపై పోరాడారు రాఖీ. అయితే కరోనా సమయంలో మికా- రాఖీలు చెట్టాపట్టాలేసుకుని తిరగడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే జూన్ 16, 2023న ఈ కేసును ఇరుపక్షాల సమ్మతితో బాంబే హైకోర్టు కొట్టేసింది. రాఖీ, మికాలు ఈ వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకున్నారని.. అందువల్ల రాఖీ తన ఫిర్యాదును ఇకపై కొనసాగించడానికి ఇష్టపడటం లేదని ఆమె తరపు న్యాయవాదులు హైకోర్టుకు తెలియజేశారు. దీనిపై ఏకీభవించిన న్యాయస్థానం ఎఫ్ఐఆర్‌ను కొట్టేసింది.

సుధీర్‌తో ప్రతీ రోజు అలా.. సీక్రెట్ రివీల్ చేసిన రష్మీ గౌతమ్
సుధీర్‌తో ప్రతీ రోజు అలా.. సీక్రెట్ రివీల్ చేసిన రష్మీ గౌతమ్

తాజాగా ఈ వివాదాన్ని మరోసారి గుర్తుచేసుకున్న రాఖీ సావంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరోజు పార్టీ సాధారణంగానే సాగింది. కేకులు కోయడం, ఉత్సాహం గడిపాము. నేను అతనితో ఏం మాట్లాడలేదు.. ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. కానీ అతను మాత్రం ముందుగానే ప్లాన్ చేసుకుని వచ్చాడు. ఈ ఘటన జరిగిన తర్వాత అందరూ తననే నిందించారు, తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు రాఖీ సావంత్.

Read more about: rakhi sawant
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X