Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కోట్లు ఉన్నాయిగా.. ఖర్చు పెట్టి సేవ చేయి.. కంగనపై రాఖీ సావంత్ ఫైర్
బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్‌పై శృంగార తార రాఖీ సావంత్ ఫైర్ అయింది. దేశంలో విపత్కర పరిస్థితుల్లో ఉన్న సమయంలో బాలీవుడ్ ప్రముఖులంతా సేవలో ఉంటే.. నీవు ఎందుకు సహాయం చేయడం లేదని కంగనను రాఖీ సావంత్ ప్రశ్నించింది. కరోనా పరిస్థితులు తీవ్రంగా ఉన్న ముంబైలో మీడియాతో మాట్లాడింది.
మరో చందమామ లాంటి గ్లామర్.. మధుమితా హాట్ లుక్స్
ఈ సందర్భంగా రాఖీ సావంత్ రోడ్డుపైనే హంగామా చేసింది. శానిటైజర్ వెదజల్లుతూ మీడియాను తన దగ్గరకు రావొద్దని హెచ్చరించింది. కరోనాను పెంచి పోషించవద్దు. కరోనాకు యవ్వనం కల్పించవద్దు అంటూ హల్చల్ చేసింది.
దేశంలో పరిస్థితి బాగాలేదని కంగన రనౌత్ అంటున్నారు. మోడీ సరిగా పనిచేస్తున్నారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే... దేశంలో చాలా చోట్ల ఆక్సిజన్ సిలెండర్ల కొరత ఉందని చెబుతున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి అంటే..
దేశంలో ఆక్సిజన్ సిలెండర్ల కొరత ఉందా? అయితే కంగన నీవు దేశానికి సేవ చేయి. నీ వద్ద కోట్ల రూపాయల ఆస్తి ఉందిగా.. ఆక్సిజన్ కొనుగోలు చేసి దేశంలోని ప్రజలకు పంపిణి చేయి అంటూ రాఖీ సావంత్ ఘాటుగా స్పందించారు.
ఇటీవల రాఖీ సావంత్ తల్లి అనారోగ్యానికి గురికాగా, సల్మాన్ ఖాన్ ఆర్థిక సహాయాన్ని అందించారు. తల్లి ఆరోగ్యవంతంగా మారడంతో ఆమె ఆనందంలో మునిగిపోయారు.