twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కోట్లు ఉన్నాయిగా.. ఖర్చు పెట్టి సేవ చేయి.. కంగనపై రాఖీ సావంత్ ఫైర్

    |

    బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్‌పై శృంగార తార రాఖీ సావంత్ ఫైర్ అయింది. దేశంలో విపత్కర పరిస్థితుల్లో ఉన్న సమయంలో బాలీవుడ్ ప్రముఖులంతా సేవలో ఉంటే.. నీవు ఎందుకు సహాయం చేయడం లేదని కంగనను రాఖీ సావంత్ ప్రశ్నించింది. కరోనా పరిస్థితులు తీవ్రంగా ఉన్న ముంబైలో మీడియాతో మాట్లాడింది.

    మరో చందమామ లాంటి గ్లామర్.. మధుమితా హాట్ లుక్స్

    ఈ సందర్భంగా రాఖీ సావంత్ రోడ్డుపైనే హంగామా చేసింది. శానిటైజర్ వెదజల్లుతూ మీడియాను తన దగ్గరకు రావొద్దని హెచ్చరించింది. కరోనాను పెంచి పోషించవద్దు. కరోనాకు యవ్వనం కల్పించవద్దు అంటూ హల్‌చల్ చేసింది.

     Rakhi Sawant serious over Kangana Ranaut comments

    దేశంలో పరిస్థితి బాగాలేదని కంగన రనౌత్ అంటున్నారు. మోడీ సరిగా పనిచేస్తున్నారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే... దేశంలో చాలా చోట్ల ఆక్సిజన్ సిలెండర్ల కొరత ఉందని చెబుతున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి అంటే..

    దేశంలో ఆక్సిజన్ సిలెండర్ల కొరత ఉందా? అయితే కంగన నీవు దేశానికి సేవ చేయి. నీ వద్ద కోట్ల రూపాయల ఆస్తి ఉందిగా.. ఆక్సిజన్ కొనుగోలు చేసి దేశంలోని ప్రజలకు పంపిణి చేయి అంటూ రాఖీ సావంత్ ఘాటుగా స్పందించారు.

    ఇటీవల రాఖీ సావంత్ తల్లి అనారోగ్యానికి గురికాగా, సల్మాన్ ఖాన్ ఆర్థిక సహాయాన్ని అందించారు. తల్లి ఆరోగ్యవంతంగా మారడంతో ఆమె ఆనందంలో మునిగిపోయారు.

    English summary
    Bollywood actress Rakhi Sawant serious over Kangana Ranaut comments on scarcity of Oxygen in the country. In this occassion, Rakhi questions, It is unavailable? Oh ho! Kangana, please serve the nation. You have so much money, buy oxygen and distribute it among people
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X