విజయ్ - త్రిష పెళ్లిలో డ్యాన్స్ చేస్తా... స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
దళపతి విజయ్, త్రిష కృష్ణన్... గత కొంతకాలంగా వార్తల్లో వ్యక్తులుగా మారారు. సూపర్‌స్టార్‌గా వెండితెరపై వెలుగొందుతున్న విజయ్... సినిమాలకు గుడ్‌బై చెప్పి తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీని స్థాపించారు. పార్టీ పెట్టిన రెండేళ్లకే తమిళనాడు ఎన్నికల్లో సునామీని సృష్టించి.. ద్రవిడ రాజకీయ దిగ్గజాలు డీఎంకే, అన్నాడీఎంకేలను ఎన్నికల్లో మట్టికరిపించారు. ఎన్నికల్లో అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిన అవతరించిన టీవీకే.. మెజారిటీ మార్కుకు 10 సీట్ల దూరంలో ఆగిపోవడంతో తమిళ రాజకీయాలు అనూహ్య మలుపు తిరుగుతున్నాయి.
ఇదే సమయంలో తమిళ రాజకీయాల్లో త్రిష పేరు మారుమోగుతోంది. విజయ్‌కి త్రిష రిలేషన్‌లో ఉన్నారని , వారిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కొద్దినెలలుగా వార్తలు వస్తున్నాయి. త్రిష ఇంటి నుంచి విజయ్ బయటకు రావాలని లేదంటే రాజకీయాల్లో ఆయన ఏం సాధించలేరంటూ బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ ఘటన జరిగిన కొద్దిరోజులకే విజయ్ సతీమణి సంగీత కోర్టులో విడాకుల పిటిషన్ వేయడం చర్చనీయాంశమైంది. తమిళ సినీ రంగానికి చెందిన ఓ నటితో తన భర్తకు అక్రమ సంబంధం ఉందని విడాకుల కారణాల్లో సంగీత ప్రస్తావించడం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఆ వెంటనే త్రిషతో కలిసి విజయ్ ఓ వివాహ కార్యక్రమానికి హాజరుకావడం తమిళ సినీ, రాజకీయ వర్గాలకు షాకిచ్చింది.

నాటి నుంచి త్రిష- విజయ్‌ల బంధం గురించి అభిమానులు, సినీ ప్రముఖులు మాట్లాడుకుంటున్నారు. ఎన్నికల రోజున తాను టీవీకే ఓటు వేసినట్లు పరోక్షంగా త్రిష పోస్ట్ పెట్టడం.. కౌంటింగ్ రోజున తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి, అక్కడి నుంచి నేరుగా విజయ్ ఇంట్లో ప్రత్యక్షం కావడంతో వీరిద్దరి బంధంపై రకరకాల కథనాలు వచ్చాయి. సంగీతతో విడాకుల కేసు కొలిక్కి వచ్చి.. పాలనలో కుదురుకున్నాక త్రిష- విజయ్‌లు పెళ్లి చేసుకుంటారని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా త్రిష- విజయ్‌ల బంధంపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు
స్పెషల్ సాంగ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాఖీ సావంత్. తన అందం, అభినయంతో కుర్రాళ్లకు సెగలు రేపారు. ఇక బిగ్‌బాస్‌లోకి వెళ్లొచ్చిన తర్వాత ఆమె ఫాలోయింగ్ మరింత పెరిగింది. సినిమాల కంటే వివాదాలతోనే రాఖీ సావంత్ వార్తల్లో నిలిచారు. అలాగే వ్యక్తిగత జీవితం కూడా వివాదాలమయం. తొలుత వ్యాపారవేత్త రితేష్ సింగ్‌ని పెళ్లి చేసుకున్న రాఖీ ఆయనకు విడాకులు ఇచ్చింది. అనంతరం కర్ణాటకకు చెందిన వ్యాపారి అదిల్ ఖాన్ దురానీని సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి కూడా పెటాకులైంది. అంతేకాదు.. అదిల్ తనను మోసం చేశాడని, నా డబ్బును అనుమతి లేకుండా వాడుకుంటున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొన్నాళ్లు జైళ్లో ఉన్న అదిల్.. అనంతరకాలంలో బిగ్‌బాస్ 12 కంటెస్టెంట్ సోమిఖాన్‌ను పెళ్లాడారు.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రాఖీ సావంత్ ఎప్పటికప్పుడు తన సినిమాలు, ఇతర వ్యక్తిగత విషయాలతో పాటు పలు అంశాలపై సంచలన పోస్ట్‌లు పెడుతుంటారు. అలాగే హాట్ హాట్ ఫోటోషూట్‌లతో కుర్రాళ్లను రెచ్చగొడుతుంటారు. ప్రస్తుతం భారత సినీ, రాజకీయ రంగాల్లో హాట్ టాపిక్‌గా మారిన త్రిష- దళపతి విజయ్ బంధంపై ఓ ఇంటర్వ్యూలో రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్రిష ఎప్పటి నుంచో నాకు తెలుసు.. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు. దళపతి విజయ్‌తో పనిచేసే అవకాశం నాకు దొరకలేదు, ఆయనంటే చాలా ఇష్టం, కనీసం దళపతితో కలిసి ఒక్క పాటైనా చేయాలని ఆశించినా నా కల నెరవేరలేదు. ఆయన విజయం చాలా సంతోషాన్చి ఇచ్చింది. టీవీకే పార్టీలో చేరాలని అనిపిస్తోంది.. త్రిష- విజయ్ చాలా మంచి జంట. కనీసం విజయ్- త్రిష మెహందీ ఫంక్షన్‌లో అయినా వారితో కలిసి డ్యాన్స్ చేసి.. ఇద్దరితో కలిసి ఫోటో దిగుతానని రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.


Click it and Unblock the Notifications


