మూడో పెళ్లికి సిద్దమైన హాట్ బ్యూటీ.. పాకిస్థాన్‌లో పెళ్లి.. స్విట్జర్లాండ్‌లో హనీమూన్‌!

ప్రతి ఒక్కరి జీవితం ప్రేమ, పెళ్లి అనేవి కామన్. ఇక సినిమా ఇండస్ట్రీలో అయితే.. నెలకొక సెలబ్రెటీ ప్రేమ, పెళ్లి, విడాకులు అంటూ వార్తల్లో నిలుస్తున్నారు. కొంతమంది సెలబ్రెటీలు తమ సినిమాల కంటే ఇలాంటి వ్యక్తిగత విషయాలపైనే ఎక్కువ ఫోకస్ పెడుతుంటారు. ఓ హాట్ హీరోయిన్ మాత్రం ఆల్రెడీ రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకుంది. తాజాగా తన మూడో పెళ్లిపై సంచలన ప్రకటన చేసింది. పాకిస్థాన్ లో పెళ్లి, ఇండియాలో రిసెప్షన్, హనీమూన్ కోసం స్విట్జర్లాండ్ లేదా నెదర్లాండ్స్ వెళ్లామంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరా అనుకుంటున్నారా? ఆ అమ్మడు ఎవరో మీరు కూడా ఓ లూక్కేయండి.

హాట్ అండ్ బోల్డ్ కామెంట్స్ చేసిన బ్యూటీ ఎవరో కాదు.. బాలీవుడ్ సినిమాలలో హాట్ సాంగ్స్, టీవీ షో లలో ప్రోగ్రామ్స్, బిగ్బాస్ రియాల్టీ షో ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హాట్ భామ రాఖీసావంత్ (Rakhi Sawant). ఈ అమ్మడు 1997లో 'అగ్ని చక్ర' అనే సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఈ సినిమాతో ఫేమ్ సంపాదించుకున్న అమ్మడు వరుస సినిమా ఆఫర్స్ అందుకుంది. ఈ అమ్మడు కెరీర్ లో 'చూరాలియా హై తుమ్ నే' సినిమాలోని 'మొహబ్బత్ హై మిర్చి'అనే పాటతో బాలీవుడ్ ఐటెం సాంగ్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది రాఖి. ఈ తరుణంలో 2006లో బిగ్ బాస్ మొదటి సీజన్ లో పాల్గొనే అవకాశం అందుకుంది ఈ హాట్ బ్యూటీ. ఈ షోలో రాఖీ టాప్ ఫైవ్ లో నిలబడింది. ఈ షో తో మరింత పాపులారిటీని సంపాదించుకుంది.

Rakhi Sawant To Marry Pakistani Actor Dodi Khan shared her third marriage plans reveal

రాఖీ సావంత్ డాన్సర్, మోడల్, నటి, టెలివిజన్ టాక్ షో హోస్ట్ రాణిస్తున్నారు. అలాగే.. హిందీ తో పాటు కన్నడ, మరాఠీ, తెలుగు, తమిళ భాషల్లో నటించి, తన అందాల ఆరబోతతో మెప్పించింది. ఈ క్రమంలోనే 2009లో 'రాఖీ కా స్వయంవర్' అనే రియాలిటీ షోను కూడా ప్రారంభించింది. ఈ షో తరువాత ఆమె కెనడియన్ ఎలేష్ పరుజన్‌వాలా ను పెళ్లి చేసుకుంది. కానీ, వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో వారు తమ వివాహబంధాన్ని తెంచుకున్నారు. ఇక 2019లో UKకి చెందిన వ్యాపారవేత్త రితేష్ సింగ్ తో సీక్రెట్ గా రిలేషన్ కొనసాగించింది. ఆ తరువాత కొన్నాళ్లకు వివాహం చేసుకుంది. కానీ , 2022లో అతడితో కూడా విడిపోయింది.

సీని కెరీర్ సక్సెస్ పుల్ గా కొనసాగుతోన్న ఈ అమ్మడు జీవితంలో ప్రేమ, పెళ్లి మాత్రం కలిసి రాలేదు. ఐటెం సాంగ్స్ తో బాలీవుడ్ లో తెగ ఫేమస్ అయిన ఈ అమ్మడు నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీ లేదా హాట్ కామెంట్స్ తో గాని వార్తల్లో నిలుస్తుంది. తాజా బాలీవుడ్‌ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ (Rakhi Sawant) తన మూడో పెళ్లిపై సంచలన ప్రకటన చేసింది. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఈ అమ్మడు.. తాను పాకిస్థాన్‌కు చెందిన నటుడు, నిర్మాత డోడి ఖాన్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించింది.

Rakhi Sawant To Marry Pakistani Actor Dodi Khan shared her third marriage plans reveal

రాఖీ సావంత్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పెళ్లి విషయంలో తనకు చాలా ప్రపోజల్స్ వస్తున్నాయని తెలిపింది. నేను పాకిస్థాన్‌కి చెందిన నటుడు నిర్మాత డోడి ఖాన్‌ (Dodi Khan)ను త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. గతంలో జరిగిన వివాహాల కారణంగా తాను చాలా సార్లు వేధింపులకు గురయ్యానని తెలిపారు. తనకు పాకిస్థాన్‌లో చాలా మంది అభిమానులు ఉన్నారని, ఆ దేశ ప్రజలను తాను ప్రేమిస్తున్నట్లు పేర్కొంది.

అలాగే రాఖీ సావంత్ తన పెళ్లి ప్లాన్ గురించి మాట్లాడుతూ.. "భారతీయులు, పాకిస్థానీలు ఒకరినొకరు లేకుండా జీవించలేరనీ, తాను ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం పాకిస్తాన్‌లో వివాహం చేసుకోనున్నట్టు ప్రకటించింది. రిసెప్షన్ ఇండియాలో జరుపుకుంటాననీ. ఇక హనీమూన్ కోసం స్విట్జర్లాండ్ లేదా నెదర్లాండ్స్ వెళ్తామనీ, పెళ్లి తర్వాత తాను, భర్త డోడి ఖాన్‌ తో దుబాయ్‌లో స్థిరపడుతానని రాఖీ సావంత్ సంచలన ప్రకటన చేశారు.ఈ నేపథ్యంలో రాఖీ సావంత్ .. డోడి ఖాన్‌ తన ఇన్‌స్టా ఖాతాలో ఓ వీడియో షేర్‌ చేశారు.

More from Filmibeat

Read more about: rakhi sawant dodi khan bollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X