Payal Rajput పీకల్లోతు కష్టాల్లో నిర్మాత.. వివాదంలో పాయల్ రాజ్‌పుత్!

RX 100 మూవీ నుంచి మంగళవారం సినిమా వరకు ఎన్నో విభిన్నమైన పాత్రలతో యువ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నది. అయితే ఆమె నటించిన రక్షణ అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ వివాదంలో చిక్కుకున్నది. ఆమె సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయడానికి సహకరించడం లేదనే కారణంతో నిర్మాత, దర్శకుడు ప్రదీప్ థాకూర్ ఫిర్యాదు చేయడంతో ఆమె పీకల్లోతు సమస్యల్లో కూరుకుపోయింది. ఈ వివాదం వివరాల్లోకి వెళితే..

రక్షణ సినిమా నిర్మాత, దర్శకుడు ప్రదీప్ థాకూర్... నటి హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌పై నిర్మాతల మండలి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె తనతో కుదుర్చుకొన్న ఒప్పందాన్ని ఆమె ఉల్లంఘించింది కాబట్టి ఆమెపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన మీడియాకు లేఖను విడుదలు చేసి ఆవేదనను వ్యక్తం చేశారు.

Rakshana Producer Director Pradeep Thakore files complaint on Payal Rajput

తెలుగు నిర్మాతల మండలి వద్ద దాఖలు చేసిన ఫిర్యాదులో.. రక్షణ సినిమా ప్రారంభానికి ముందు సుమారుగా 50 రోజులపాటు డేట్స్ ఇవ్వాలని, అలాగే అదనంగా సినిమా ప్రమోషన్స్‌కు రావాలనే కాకుండా సినిమా రిలీజ్ వరకు సహకరించాలని సంతకం చేసింది. అయితే ప్రమోషన్స్ రావాలని రిక్వెస్ట్ చేస్తే.. రాకుండా తన అగ్రిమెంట్‌ను ఉల్లంఘిస్తున్నది అని ఆయన అన్నారు.

పాయల్ రాజ్‌పుత్‌తో సినిమా ప్రారంభించిన తర్వాత కోవిడ్ వచ్చింది. దాంతో తాను చాలా ఆర్థికపరమైన సమస్యల్లో పడ్డాను. అయితే వాటిన్నిటిని అధిగమించాను. ప్రస్తుతం ఆ సినినిమాను ఏప్రిల్ 19వన ఓటీటీలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసి ప్రమోషన్స్‌కు సహకరించాలని అడిగాను. కానీ ఆమె ఎలాంటి బాధ్యత వహించకుండా ప్రమోషన్స్‌కు ముఖం చాటేసింది అని నిర్మాత తన ప్రకటనలో తెలిపారు.

సినిమా రిలీజ్‌కు సహకరిస్తే.. ఇంకా ఇవ్వాల్సిన 6 లక్షల రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఆమె నాకు చెప్పిన ప్రకారం.. 50 రోజులకు.. 47 రోజులు మాత్రమే ఉపయోగించుకొన్నాను. కాబట్టి అయినా ఆమె నాకు సహకరించడం లేదు. దాంతో నేను, నా ఫ్యామిలీ తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయాను. ఒకవేళ ఆమె ప్రమోషన్స్ వస్తే.. సినిమాకు మేలు జరిగి.. బిజినెస్, రాబడి వచ్చే అవకాశం ఉంటుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

రక్షణ సినిమా విడుదలయ్యే విధంగా సహకరించాలని పాయల్ రాజ్‌పుత్ మేనేజర్ సౌరభ్ ధింగ్రాను సంప్రదించాలని తీవ్ర ప్రయత్నాలు చేశాం. కానీ వారి నుంచి ఎలాంటి స్పందన తిరిగి రాలేదు. దంతో ఆమెపై చర్య తీసుకోవాలని నిర్మాతల మండలి, అలాగే మా సంస్థను ఆశ్రయించి ఫిర్యాదు చేయాల్సి వచ్చింది అని ప్రదీప్ థాకూర్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X