మనిద్దరం కలిసి చేయాల్సింది చాలా ఉంది.. నాకు కావాల్సిందిదే.. రకుల్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
ఎవరైనా తమ పుట్టిన రోజును మరిచిపోకుండా ఉండేట్టుగా ప్లాన్ చేసుకుంటారు. తమకు ఇష్టమైన వ్యక్తుల మధ్య, నచ్చిన ప్రదేశంలో ఉండాలని కోరుకుంటాడు. అయితే రకుల్ కూడా.. అలానే ప్లానే వేసుకుంది.. పుట్టిన రోజును ఘనంగా జరుపుకుంది.

పుకెట్‌లో అమ్మానాన్నలతో..
థాయ్‌లాండ్‌లోని పుకెట్‌లో తన బర్త్‌డే వేడుకులను రకుల్ గ్రాండ్‌గా జరుపుకుంది. తన అమ్మానాన్నలతో కలసి బీచ్ ఒడ్డున ఎంజాయ్ చేసింది. ఆనందంతో కేక్ కట్ చేస్తూ.. గంతులేసింది. అయితే పుట్టిన రోజు కదా.. కాస్త ఆలస్యంగా లేద్దామని మాత్రం అనుకోలేదు. ఉదయాన్నే వర్కౌట్లు, యోగా కూడా చేసింది. ఇక రకుల్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తాయి.

మంచు లక్ష్మీ విషెస్‌కు.. రకుల్ వెరైటి రిప్లై
మంచు లక్ష్మీ, రకుల్ ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అన్నది టాలీవుడ్ మొత్తానికి తెలుసు. అయితే రకుల్ బర్త్‌డేన మంచు లక్ష్మీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. అయితే ఈ ఏడాదైనా నీకు ఓ బాయ్‌ఫ్రెండ్ దొరకాలను కోరుకుంటున్నాను అని విష్ చేసింది. మనిద్దరం కలిసి ఇంకా ఎన్నో చేయాలి అంటూ.. ఆ బాయ్ ఫ్రెండ్ కూడా దొరకాలంటూ రకుల్ రిప్లై ఇచ్చింది.

తల్లితండ్రులతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ..
తన తల్లిదండ్రులతో గడిపిన ఆనంద క్షణాలను గుర్తు చేసుకుంటూ.. కాస్ల ఎమోషనల్ అయినట్టు కనిపిస్తోంది. ఇదే నాకు కావాల్సింది. కుటుంబంతో గడిపే క్షణాలు, ఒక కూతురిని అయినందకు కాస్త గారాభం, ఇంతకంటే మంచి రోజు ఇక నేను అడగను..అంటూ ఫ్యామిలీ ఫోటోను షేర్ చేసింది.
కెరీర్ పరంగా...
రకుల్‌కు కాలం కలిసి రావడం లేదు. తెలుగులో హిట్ కొట్టి చాలా కాలమైంది. రీసెంట్‌గా మన్మథుడు 2 చిత్రంతో పలకరించింది. అయితే సినిమా డిజాస్టర్ కావడంతో అడ్రస్ లేకుండా పోయింది. ఇక హిందీలో చేసిన దేదే ప్యార్ దే సినిమా పర్వాలేదనిపించింది. మార్జావాన్ అంటూ త్వరలోనే బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనుంది.


Click it and Unblock the Notifications











