బికినీ కొనడంలో డాడీయే సలహా ఇస్తాడు.. వేసుకుంటే ఏంటని అమ్మే ప్రశ్నిస్తుంది.. రకుల్ కామెంట్స్
రకుల్ ప్రీత్ మిస్ ఇండియా కాంపిటిషన్‌లో పాల్గొని అందులో గెలుపొందిన సంగతి తెలిసిందే. అందులో ఆమె చూపిన బికినీ అందాలకే వెండితెరపై అవకాశాలు వెల్లువెత్తాయి.అయితే మిస్ ఇండియా కాంపిటీషన్ అంటే కచ్చితంగా బికినీ ధరించాల్సిందే.వాటితోనే ర్యాంప్ వాక్ చేయాల్సి ఉంటుుంది. ఇదే విషయాన్ని తల్లిదండ్రులతో చెబితే వారు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారట. తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ వాటి గురించి రకుల్ చెప్పుకొచ్చింది. అవేంటో ఓ సారి చూద్దాం.

తల్లి ప్రోత్సాహంతోనే..
ఆమెను మిస్ ఇండియాగా చూడాలని, ఆ పోటీల్లో పాల్గొనేలా చేసింది కూడా తానేనని రకుల్ అమ్మ చెప్పుకొచ్చింది. తానే ఈ పోటీల్లో పాల్గొనేలా చేశానని, రకుల్ మాత్రం ఆ సమయంలో అందుకు సిద్దంగా లేదని కూడా తెలిపింది.

వేసుకుంటే తప్పేముంది..
అయితే మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనాలి అంటే బికినీ ధరించాల్సి ఉంటుందని తెలిసి, అవును బికినీ ధరిస్తే ఏమవుతుంది దాంట్లో ఏముందని తన అమ్మే తిరిగి ప్రశ్నించిందని రకుల్ చెప్పుకొచ్చింది. తాను బికినీ ధరించడంలో తనకంటే తన తల్లిదండ్రులే మరింత కంఫర్ట్‌గా ఫీలవుతారని పేర్కొంది.

బికినీ షాపింగ్స్‌కు డాడీ సలహాలు..
ఇంకో విషయం చెప్పాలంటూ రకుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ కాలంలో తల్లిదండ్రులు బికినీ ధరించడంపై పిల్లలకు ఆంక్షలు విధిస్తారని అనుకుంటారు కానీ.. తన తండ్రి మాత్రం బికినీ షాపింగ్‌కు వెళ్లేటప్పుడు సలహాలు కూడా ఇస్తారని తెలిపింది. వైబ్రెంట్ కలర్స్‌వి తీసుకో డల్ కలర్స్ వద్దని సూచిస్తాడని చెప్పుకొచ్చింది.
Recommended Video

రకుల్ వీడియోలు వైరల్..
సోషల్ మీడియాలో రకుల్ బికినీ వీడియోలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. మిస్ ఇండియా కాంపిటీషన్‌లో భాగంగా రకుల్ ధరించిన బికినీ ఫోటోలు, వీడియోలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి.


Click it and Unblock the Notifications











