టాలీవుడ్‌కు వచ్చి ఏడేళ్లు.. తెలుగమ్మాయిలా మారిపోయానన్న రకుల్‌

రకుల్ ప్రీత్ సింగ్ మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాలో ప్రేరణ పాత్రలో రకుల్ అందర్నీ ఆకర్షించింది. అలా మొదటి చిత్రంతో రకుల్ తనదైన ముద్రను వేసుకుంది. అయితే త్వరగానే రకుల్‌కు స్టార్ స్టేటస్ వచ్చేసింది. మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా స్టార్ హీరోలందరితోనూ పని చేసేసింది. అయితే ఎంత తొందరగా స్టార్ హీరోయిన్ అయిందో.. అంతే ఫాస్ట్‌గా డౌన్ ఫాల్ అయింది.

వరుసగా ఫ్లాపులు పలకరించడంతో ఆ మధ్య రకుల్‌ను పక్కన పెట్టేశారు. అయితే రకుల్ ఈ మధ్య మళ్లీ ఫుల్ బిజీగా అవుతోంది. వార్తల్లోనూవైరల్ అవుతోంది. ఆ మధ్య డ్రగ్స్ కేసులో రకుల్ పేరు బయటకు రావడంతో ఒక్కసారిగా నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అయింది. అయితే రెండు మూడు రోజుల క్రితం రకుల్ సినిమా ప్రాజెక్ట్‌లపై అనేక రకాల పుకార్లు వచ్చాయి. రకుల్‌కు సినిమా ఆఫర్లు రావడం లేదన్న వార్తలను ఖండించి.. తాను చేయబోయే ప్రాజెక్ట్‌లను ప్రకటించింది ఆమె టీం.

Rakul Preet About Competing 7 years In TFI

తాజాగా రకుల్ నటిగా ఏడేళ్లు పూర్తి చేసుకోవడంతో ఆనందంలో తేలిపోయింది. ఢిల్లీ అమ్మాయి నుంచి పూర్తిగా తెలుగమ్మాయిగా మారిపోయాను.. నన్ను అంతలా ఆదరించినందుకు ధన్యవాదాలంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చి ఏడేళ్లు అవుతోంది.. అప్పుడు నా మొహం మీద చిరునవ్వులే ఉండేవి. ఇప్పుడు కూడా అవే ఉన్నాయి.. ఎందుకంటే.. ఢిల్లీ అమ్మాయినైనా నన్ను తెలుగమ్మాయిలా మీరంతా నన్ను అంగీకరించారు.. ఈ ప్రయాణం అద్భుతంగా సాగిందని ఎమోషనల్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X