ఆ పనులు చేస్తే సంతోషం రాదు.. అదొక ఫీలింగ్ అంటోన్న రకుల్
రకుల్ ప్రీత్ తెలుగులో ఎంతగా ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసిన రకుల్.. స్టార్ హీరోలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఇంత వరకు వెండితెరపై రకుల్ సందడి చేయగా.. లాక్ డౌన్‌లో అంతకు మించి సందడి చేసింది. ఇంటి సభ్యులతో ఈ మూడు నెలలు సంతోషంగా గడిపింది. తమ్ముడితో కలిసి ఆట పాటలు, తండ్రితో సేవలు చేయించుకుని తెగ హల్చల్ చేసింది.
ఈ మూడు నెలల సమయంలో రకుల్ ఎన్నో ప్రయోగాలు చేసింది. వంటింట్లో దూరి కొత్త కొత్త వంటకాలను చేసింది. ఈ మధ్యే గుమ్మడి కాయతో ఓ కేక్‌ను కూడా తయారు చేసింది. ఊరిస్తూ ఆ కేక్‌ను తింటూ ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతకు ముందు కూడా ఫ్యామిలీ కోసం వంటింట్లో దూరి కొత్త వంటకాలను చేసి పెట్టింది.

తాజాగా రకుల్ ప్రీత్ ఓ ఫోటోను షేర్ చేసింది. దాంతో పాటు ఓ కామెంట్ కూడా చేసింది. సంతోషమనేది ఏవే కొన్ని పనులు చేస్తే రాదని, అదోక ఫీలింగ్ అని అనుభవించాలని చెప్పుకొచ్చింది. మిగిలిన జీవితాన్ని ఆనందంగా, సంతోషంగా జీవించండనే కొటేషన్ రాసుకొచ్చింది. మంచు లక్ష్మీ నిర్వహించే స్కూల్‌లో రకుల్ ప్రీత్ అప్పుడప్పుడు పిల్లలకు పాఠాలు చెబుతూనే ఉంటుందన్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











