వైరల్ వీడియో : ఓ వావ్ మెడికల్ షాప్‌లో అవి కూడా అమ్ముతున్నారా.. రకుల్ సెటైర్
రకుల్ ప్రీత్ వెండితెరపై ఎంతగా మెరుస్తూ ఉంటుందో సోషల్ మీడియాలో అంతకు పదింతలు మెరుస్తూ ఉంటుంది. తన వస్త్రాధారణ విషయంలో, వ్యాయామం చేసే విషయం, నెటిజన్ల ట్రోలింగ్స్ రూపంలో రకుల్ ప్రీత్ ఫుల్ ఫేమస్ అవుతూ ఉంటుంది. అంతే ఘాటుగా రకుల్ ఇచ్చే సమాధానాలు కూడా తెగ వైరల్ అవుతూ ఉంటాయి. రకుల్ క్వారంటైన్‌లో చేస్తున్న చిలిపి పనులు, చేష్టల గురించి చూస్తూనే ఉన్నాం. తాజాగా సాధారణ అమ్మాయిలా బయటకు వచ్చిన రకుల్ వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.

క్వారంటైన్‌లో సందడి..
క్షణం తీరిక లేకుండా గడిపే స్టార్స్ ఇంట్లో ప్రశాంతంగా ఫ్యామిలితో సమయాన్ని గడిపేస్తున్నారు. రకుల్ కూడా ఈ క్వారంటైన్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రోజులో అత్యధిక భాగం జిమ్‌లోనే గడిపే రకుల్.. క్వారంటైన్ మూలంగా ఇంటినే జిమ్‌గా మార్చేసింది. ఇంట్లోని వస్తువులతోనే వర్కౌట్లు చేస్తోంది.

సేవా కార్యక్రమాల్లోనూ..
తన ఇంటికి దగ్గర్లో ఉన్న గ్రామాలకు, నిరుపేదలకు ఆహారాన్ని అందిస్తూ మంచి మనసును చాటుకుంది. ఫ్యామిలీ సాయంతో ఇంట్లోనే వంటలు వండి.. వారికి కావాల్సిన ఆహారాన్ని పంపుతున్నట్లు తెలుపింది. ఆ కార్యక్రమాలన్నీ తన తండ్రి చూసుకుంటున్నాడని చెప్పుకొచ్చింది.

సోదరుడితో ఆటలు..
ఈ క్వారంటైన్‌ను రకుల్ తన సోదరుడితో కలిసి బాగా ఎంజాయ్ చేస్తోంది. చిన్నప్పుడు ఆడుకున్న ఆటలను సోదరుడు అమన్‌తో కలిసి ఆడుతోంది. పులుసు పట్టడం, దిండుతో ఆడే ఆటలు, కబడ్డీ ఇలా అక్కాతమ్ముడు కలిసి ఆడిన ఆటలు, దానికి సంబంధించిన వీడియో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.
Recommended Video

ఓ వావ్ అవునా నాకు తెలీదే..
తాజాగా మరో రకుల్ ప్రీత్‌కు సంబంధించిన మరో వీడియో చక్కర్లు కొడుతోంది. ఓ సాధారణ యువతి మల్లె మెడికల్ షాపుకెల్లి మందులను కొనుక్కొని వచ్చింది. ఓ అభిమాని ఈ వీడియోను తీసినట్టు తెలుస్తోంది. ఇక ఈ వీడియో తెగ వైరల్ కాగా.. ఆమె ఆల్కహాల్ కొనడానికి షాప్‌కు వెళ్లిందా? అని కొన్ని వెబ్‌సైట్స్ వార్తలు రాశాయి. వీటిపై రకుల్ సెటైర్స్ వేస్తూ.. ఓ వావ్, మెడికల్ షాపు వాళ్లు ఆల్కహాల్ అమ్ముతుంటారని నాకు తెలీదే.. అంటూ ట్వీట్ చేసింది.


Click it and Unblock the Notifications











