చిన్నపిల్లలా మారిన రకుల్.. అలా ఎగురుతూ రచ్చ!
రకుల్ ప్రీత్ ప్రస్తుతం ఎంత బిజీగా ఉందో అందరికీ తెలిసిందే. బాలీవుడ్‌లో పలు ప్రాజెక్ట్‌లు చేస్తూనే కోలీవుడ్, టాలీవుడ్‌లను కూడా కవర్ చేసేస్తోంది. ప్రస్తుతం రకుల్ తెలుగులో హవా చూపించలేకపోతోంది. చెక్ సినిమాతో ఈ మధ్యే పలకరించిన రకుల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమాలో రకుల్ లాయర్ పాత్రను పోషించింది. అయితే చెక్ సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది.
అలా తన పాత్రకు మంచి పేరు వచ్చినా కూడా సినిమా కమర్షియల్‌గా వర్కవుట్ అవ్వలేదు. ఇక రకుల్ మరో ప్రాజెక్ట్‌తో లక్ పరీక్షించుకునేందుకు రెడీగా ఉంది. వైష్ణవ్ తేజ్ క్రిష్ కాంబోలో రాబోతోన్న సినిమాలో రకుల్ పల్లెటూరి పిల్ల పాత్రను పోషిస్తోంది. ఇవి కాకుండా బాలీవుడ్‌లో మూడు నాలుగు ప్రాజెక్ట్‌లున్నాయి. కోలీవుడ్‌లో శివ కార్తికేయన్ హీరోగా రాబోతోన్న ఓ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇక సినిమాలు కాకుండా రకుల్ వివధ మ్యాగజైన్ల ఫోటో షూట్లు, ప్రకటనలతో ఫుల్ బిజీగా ఉంటోంది. తాజాగా రకుల్ ఓ యాడ్ ప్రకటనలో నటించింది. ఆ షూటింగ్ గ్యాప్‌లో రకుల్ ఫుల్ఎంజాయ్ చేసింది. స్ప్రింగ్‌లా ఎగురుతూ ఫుల్ హల్చల్ చేసింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











