నాకు నచ్చిన వన్నీ చేసేశా.. మంచు లక్ష్మీతో రకుల్ రచ్చ
రకుల్ ప్రీత్ ప్రస్తుతం హైద్రాబాద్‌లోనే రచ్చ చేస్తోంది. వరుసగా షూటింగ్‌లతో బిజీగా ఉంటోంది.ఈ మధ్యే తెలుగులో చెక్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమా ఫలితం తేడా కొట్టినా రకుల్ లుక్స్, యాక్టింగ్ పర్వాలేదనిపించింది. అయితే రకుల్‌కు మాత్రం మళ్లీ డిజాస్టర్ పడ్డట్టే అయింది. ఇక రకుల్ ప్రీత్‌కు ఇప్పుడు క్రిష్ ప్రాజెక్ట్ ఒక్కటే మిగిలి ఉంది. కోలీవుడ్ బాలీవుడ్‌లో అనేక చిత్రాల్లో రకుల్ నటిస్తోంది.
కానీ తెలుగులో మాత్రం వైష్ణవ్ తేజ్ క్రిష్ కాంబినేషన్‌లో రాబోతోన్న చిత్రమే రకుల్ చేతిలో ఉంది. ఇప్పుడు రకుల్ తన వీకెండ్‌ను వేరే లెవెల్‌లో సెలెబ్రేట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. హోలీ సందర్భంగా మంచు లక్ష్మీ, రకుల్ ప్రీత్ ఇద్దరూ కూడా తమ స్నేహితులతో కలిసి హోలీని స్పెషల్‌గా సెలెబ్రేట్ చేసుకున్నారు. కరోనా కారణంగా ఈ రంగులు చల్లుకోవడం వంటి వాటికి దూరంగా ఉండి ప్రకృతికి దగ్గరగా వెళ్లారు.

అలా తమ ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా కలిసి కాకయింగ్ అనే ప్లేస్‌కు వెళ్లి రచ్చ చేశారు. అక్కడే ట్రెక్కింగ్, బోటింగ్ అంటూ రచ్చ రచ్చ చేశారు. ఇదే విషయాన్ని రకుల్ చెప్పుకొచ్చింది. ఈ వీకెండ్ నాకు నచ్చినవన్నీ చేసేశాను.. ట్రెక్కింగ్, యోగా, యోగా, సముద్రం నడి మధ్యలో చంద్రుడిని చూడటం ఇలా నా గ్యాంగ్‌తో కలిసి నాకు ఇష్టమైన వన్నీ చేశాను. ఈ ట్రిప్ ఎంతో బాగుందని రకుల్ సంబరపడిపోయింది.


Click it and Unblock the Notifications











