200 కుటుంబాలకు అండగా రకుల్.. దాని కంటే మిన్న ఏదీ లేదంటోన్న హీరోయిన్

కరోనా వైరస్ ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేసేస్తోంది. అగ్రరాజ్యమైన అమెరికాను అతలాకుతలం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మందికి కరోనా సోకగా.. వేలమంది ప్రాణాలను కోల్పోయారు. మన దేశంలోనూ కరోనా తాండవం చేస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు కుప్పలు తెప్పులుగా పెరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపు 2500మందికి కరోనా సోకింది. కరోనాను కట్టడి చేయడంలో భాగంగా భారత ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది.

21 రోజుల లాక్ డౌన్..

21 రోజుల లాక్ డౌన్..

శరవేగంగా వ్యాపిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించింది. ఈ సమయంలో ప్రజలెవరూ రోడ్ల మీదుక రాకూడదని, ఇంటికి పరిమితం కావాలని ఆదేశించింది. దీంతో దేశంలో అన్ని కార్యకలాపాలు స్తంభించిపోయాయి. దినసరి కూలీలు, శ్రామికులు, కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

 ఆదుకునేందుకు అండగా తారలు..

ఆదుకునేందుకు అండగా తారలు..

కరోనా వైరస్‌పై పోరాటం చేసేందుకు సినీ తారలు ముందుకు వచ్చారు. తమకు తోచిన ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తూ ప్రభుత్వాలకు అండగా నిలబడుతున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అందరూ హీరోలు తమ స్థాయికి తగ్గట్టు ఆర్థిక విరాళాలు ప్రకటిస్తున్నారు.

అక్షయ్ కుమార్ భారీ విరాళం..

అక్షయ్ కుమార్ భారీ విరాళం..

ఇప్పటి వరకు వచ్చిన విరాళాల్లో అక్షయ్ కుమార్ ఇచ్చిన రూ.25కోట్ల విరాళం అత్యధిక మొత్తం. షారుఖ్ ఖాన్ తన స్వచ్చంద సంస్థలతో నేరుగా ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తున్నారు. పేదవారి ఆకలిని తీర్చుతున్నాడు. మన తెలుగు హీరోలు.. తమకు తోచిన ఆర్థిక సాయాన్ని ప్రభుత్వాలకు విరాళంగా ఇచ్చారు. ఇందులో ప్రభాస్ అత్యధికంగా నాలుగు కోట్ల విరాళాన్ని ప్రకటించాడు.

హీరోయిన్లలో కదలిక..

హీరోయిన్లలో కదలిక..

అయితే ఇలాంటి కష్ట సమయాల్లో హీరోలు మాత్రమే ముందుకు రావడం చర్చనీయాంశమైంది. స్టార్స్‌గా వెలుగొందుతున్న హీరోయిన్స్ ఏ మాత్రం నోరు మెదపకపోవడం, ఆర్థిక సాయాన్ని ప్రకటించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ప్రణీత ముందడుగు వేసి ఓ యాభై కుటుంబాలకు అండగా నిలబడింది. లావణ్య త్రిపాఠి సినీ కార్మికుల కోసం లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించింది. తాజాగా రకుల్ తన మంచి మనసును చాటుకుంది.

Recommended Video

Cine Box : RGV Shared Hilarious Picture Of Pawan Kalyan And Nara Lokesh, Have A Look !
200 కుటుంబాలకు అండగా..

200 కుటుంబాలకు అండగా..

గుర్‌గావ్‌లోని తన ఇంటికి దగ్గర్లో ఉన్న రెండు వందల కుటుంబాలకు రోజూ రెండు పూటల అన్నం పెడుతోందట. తన ఇంటి చుట్టుపక్కల ఉన్న పేదవారిని తన తండ్రి గుర్తించాడని, వారికి నిత్యం ఆహారం అందిస్తున్నామని తెలిపింది. లాక్ డౌన్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు వారికి ఆహారాన్ని అందిస్తామని చెప్పుకొచ్చింది. వారు ఆ ఆహారాన్ని తింటూ ఉంటే వారి కళ్లలో వచ్చే ఆనందం చూస్తే అంత కంటే గొప్ప ఫీలింగ్ మరెక్కడా కనిపించదని పేర్కొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X