‘మేడే’ కోసం రెడీ.. మళ్లీ మొదలెట్టేసిన రకుల్
రకుల్ ప్రీత్ ఈ మధ్యే కరోనా నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, తనను కలిసిని వారంతా కూడా పరీక్షలు చేయించుకుని జాగ్రత్తగా ఉండాలంటూ రకుల్ చెప్పుకొచ్చింది. ఇక తాను క్వారంటైన్‌లోనే ఉన్నానంటూ పేర్కొంది. అయితే దాదాపు పది రోజుల క్వారంటైన్ తరువాత తనకు నెగెటివ్ వచ్చిందంటూ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పేసింది. అలా కరోనా నెగెటివ్ వచ్చిందో లేదో ఇలా పనిలోకి వచ్చేసింది.
రకుల్ ప్రస్తుతం బాలీవుడ్ క్రేజ్ ప్రాజెక్ట్ మేడేతో బిజీగా ఉంది. ఆ సినిమా షూటింగ్ కోసం వెళ్లిన సమయంలో రకుల్‌కు పాజిటివ్ అని తేలింది. అంతకుముందు క్రిష్ సినిమాతో రకుల్ బిజీగా ఉంది. కానీ మేడే సెట్‌లో అడుగుపెట్టిన రెండు మూడు రోజులకే రకుల్ కరోనా బారిన పడింది. మొత్తంగా రకుల్ ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. మేడే సెట్‌లో అడుగు పెట్టేందుకు రెడీ అయింది. ఈ మేరకు రకుల్ ఓ పోస్ట్ చేసింది.

మేకప్ వేసుకుంటూ రెడీ అవుతున్న రకుల్.. ఫుల్ హ్యాపీగా ఉంది. ఖాళీగా ఇంట్లోనే దాదాపు పది పదిహేను రోజులు క్వారంటైన్‌లో ఉంది. ఇప్పుడు మళ్లీ పనిలోకి రావడంతో ఫుల్ ఖుషీగా ఉన్నట్టు చెప్పుకొచ్చింది. హ్యాపీ వర్క్ అని మేకప్ రూంలో రెడీ అవుతున్న వీడియోను షేర్ చేసింది. మేడే షూటింగ్‌లో పాల్గొనబోతోన్నానంటూ రకుల్ సంబరంలో మునిగి తేలిపోతోంది. ఇక రకుల్ నితిన్ కాంబోలో వస్తోన్న చెక్ ఫస్ట్ గ్లింప్స్ తాజాగా రిలీజ్ అయింది.


Click it and Unblock the Notifications











