లొట్టలేసుకుంటూ మరీ తింటోంది.. నెటిజన్లను ఊరిస్తోన్న రకుల్

రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు ప్రేక్షకుల మనసును, అభిమానాన్ని దోచేసింది. సినిమాలతోనే కాకుండా మంచి పనులు చేస్తూ అందరికీ దగ్గరైంది. తెలుగులో అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇక్కడ స్టార్డమ్‌తో కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ అవకాశాలను సంపాదించుకుంది. ప్రస్తుతం మాత్రం రకుల్ ఇంటి పట్టునే ఉంటోంది. ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ కారణంగా గత మూడు నెలలుగా రకుల్ ఇంట్లోనే ఉంటూ సందడి చేస్తోంది. లాక్ డౌన్ కాలంలో రకుల్ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు.

లాక్ డౌన్ సమయంలో పేద వారికి అన్నం పెట్టి అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఇక సినిమా షూటింగ్‌లంటూ నిత్యం బిజీగా ఉండే రకుల్‌కు కుటుంబంతో గడిపేందుకు చక్కటి సమయం దొరికింది. సోదరుడితో ఆటలు ఆడుకుంటూ, తండ్రితో సేవలు చేయించుకుంటూ మహారాణిలా మారిపోయింది. అయితే ఈ లాక్ డౌన్ సమయంలోనే రకుల్ తనలోని ప్రతిభను మరింత మెరుగుపర్చుకుంది. వంటింట్లో దూరి కొత్త రకాల వంటకాలను నేర్చుకుంది.

Rakul Preet Makes pumpkin Chocolate Cake Goes Viral

తాజాగా ఓ కేక్‌ను తయారు చేసినట్టు తెలుస్తోంది. అసలే ఫిట్ నెస్ అంటూ 24 గంటలూ జిమ్‌లోనే కష్టపడే రకుల్.. కేక్ వంటి ఫ్యాట్ పదార్థాలను తింటోందంటే అందరికీ ఆశ్చర్యం కలుగుతంది. అందుకే ముందుగానే క్లియర్‌గా పేర్కొంది. ఆ కేక్ ఎంతో స్పెషల్ అని, క్లీన్ ఫుడ్ అని, తాను తినగలిగే అన్ని పదార్థాలు అందులో ఉన్నాయని తెలిపింది.

Rakul Preet Makes pumpkin Chocolate Cake Goes Viral

అంతేకాకుండా అది గ్లూటెన్ ఫ్రీ అని, గ్రెయిన్ ఫ్రీ అని, షుగర్ ఫ్రీ అని చెప్పుకొచ్చింది. అయితే ఇదంతా నమ్మడానికి మీకు కష్టమేనని.. గుమ్మడికాయతో చేసిన చాక్‌లేట్ కేక్ అని ఎంతో అద్భుతంగా ఉందని పేర్కొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X