వైరల్ వీడియో : రకుల్ మరీ ఇంత చిలిపా?. క్వారంటైన్‌లో ఎలాంటి చేష్టలో మీరే చూడండి!
రకుల్ ప్రీత్ సినిమాలతో ఎంతగా ఫేమస్ అయిందో.. డ్రెసింగ్స్, సోషల్ మీడియాలో కామెంట్స్, జిమ్‌లో వర్కౌట్ల వీడియోలతో అంతకు రెట్టింపు క్రేజ్ తెచ్చుకుంది. రకుల్ వస్త్రధారణ ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. కార్‌లో సెషన్ అయిపోయిందా? అని ఓ నెటిజన్ కామెంట్ చేయడం, వాటికి రకుల్ కూడా అలాంటి పరుష పదజాలంతోనే కౌంటర్స్ వేయడం అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఇలా రకుల్ ప్రీత్ సారి ఏదో ఒక సెన్సేషన్ చేస్తూనే ఉంటుంది. తాజాగా రకుల్ ఆడిన ఆటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అవేంటో ఓ సారి చూద్దాం.

అంతా క్వారంటైన్‌లోనే..
దాదాపు గత 50 రోజుల నుంచి ప్రజలంతా ఇంటి పట్టునే ఉంటూ లాక్ డౌన్‌ను పాటిస్తున్నారు. ఈ క్రమంలో క్షణం తీరిక లేకుండా గడిపే స్టార్స్ ఇంట్లో ప్రశాంతంగా ఫ్యామిలితో సమయాన్ని గడిపేస్తున్నారు. తాజాగా రకుల్ కూడా ఈ క్వారంటైన్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

వర్కౌట్లతో బిజీబిజీ..
రకుల్ ప్రీత్ అంటే వర్కౌట్లకు ఫేమస్ అని అందరికీ తెలిసిందే. రోజులో అత్యధికా భాగం జిమ్‌లోనే ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇంటినే జిమ్‌గా మార్చేసింది. ఇంట్లో ఉన్న వస్తువులతోనే వ్యాయామం చేస్తోంది. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తోంది.
సేవా కార్యక్రమాల్లోనూ..
లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన కార్మికులు, వలస శ్రామికులకు ఆహారాన్ని అందిస్తూ మంచి మనసును చాటుకుంది. ఇంట్లోనే వంటలు వండి.. వారికి కావాల్సిన ఆహారాన్ని పంపుతున్నట్లు తెలుపింది. దాదాపు 2 వేల మందికి ఇలా ఆహారాన్ని పంపుతున్నట్లు తెలిపింది.

సోదరుడితో ఆటలు..
చిన్నప్పుడు ఆడుకున్న ఆటలను ఈ క్వారంటైన్‌లో సోదరుడు అమన్‌తో కలిసి ఆడుతోంది. పులుసు పట్టడం, దిండుతో ఆడే ఆటలు, కబడ్డీ ఇలా అక్కాతమ్ముడు కలిసి బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











