స్టార్ హీరోయిన్ల మధ్య ఫైట్.. ఒకరిపై ఒకరు కాలితో.. వీడియో వైరల్!
Recommended Video

రకుల్ ప్రీత్ సింగ్, పూజ హెగ్డే క్రేజీ హీరోయిన్లుగా సౌత్ లో దూసుకుపోతున్నారు. వరుసగా వీరిద్దరూ స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోయిన్ల మధ్య ఇగో ఫిలింగ్స్ ఉంటాయనే టాక్ అప్పుడప్పుడూ వినిపిస్తూ ఉంటుంది. తాజాగా రకుల్, పూజ హెగ్డే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూస్తే స్టార్ హీరోయిన్లు ఇలా కూడా ఉంటారా అని ఆశ్చర్యం కలగక మానదు.

జిమ్‌లో ఫైట్
రకుల్, పూజా హెగ్డే మధ్య జిమ్ లో ఫైట్ జరిగింది. సినిమా ఫైట్ కాదు.. నిజమైన ఫైట్ అంతకంటే కాదు. సరదాగా వీరిద్దరూ ఫిట్ నెస్ కోసం ఈ విధంగా కష్టపడ్డారు. పూజ, రకుల్ ఇంత సరదాగా ఉంటారా అని ఆశ్చర్యపోతారు. ఇదంతా ప్రముఖ ఫిట్ నెస్ టైనర్ హారిసన్ జేమ్స్ ఆధ్వర్యంలో జరిగింది.
ఒకరిపై ఒకరు కాలితో
మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తరహాలో రకుల్, పూజా హెగ్డే మధ్య ఫైట్ సీన్ జరిగింది. ఒకరు కాలితో కిక్ ఇస్తుండగా మరొకరు తప్పించుకుంటున్నారు. పక్కనే జిమ్ఫిట్ నెస్ ట్రైనర్ హారిసన్ జేమ్స్ నిలబడి సూచనలు చేస్తున్నాడు. రకుల్, పూజా హెగ్డే కలసి ఇంతవరకు నటించలేదు కానీ వీరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది.

టాలీవుడ్‌లో తగ్గినజోరు
ఈ మధ్యన రకుల్ ప్రీత్ సింగ్ జోరు కాస్త టాలీవుడ్ లో తగ్గింది. మహేష్, ఎన్టీఆర్, రాంచరణ్, అల్లు అర్జున్, రవితేజ వంటి స్టార్ హీరోల సరసన రకుల్ ఇప్పటికే నటించిన సంగతి తెలిసిందే. తమిళంలో మంచి అవకాశాలు అందుకుంటోంది. సూర్య ఎన్‌జికె, కార్తీ కొత్త చిత్రం దేవ్ వంటి చిత్రాలలో అవకాశం దక్కించుకుంది. శివకార్తికేయన్ కొత్త చిత్రంలో కూడా రకుల్ హీరోయిన్ గా ఎంపికైంది.

క్రేజీ హీరోయిన్‌గా పూజా హెగ్డే
పూజా హెగ్డే టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇటీవలే అరవింద సమేత చిత్రంతో ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం మహేష్ బాబు సరసన మహర్షి, ప్రభాస్ 20వ చిత్రంలో నటిస్తోంది. డీజే చిత్రం తరువాత తెలుగులో పూజా హెగ్డే క్రేజ్ విపరీతంగా పెరిగింది.


Click it and Unblock the Notifications











