కొత్త మూవీ సెట్‌లో రకుల్.. అలా రచ్చ చేస్తోందిగా!
ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నంత బిజీగా మరో హీరోయిన్ కనిపించడం లేదు. వరుస చిత్రాలతో రకుల్ ఫుల్ హల్చల్ చేస్తోంది. అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా వరుసగా ప్రాజెక్ట్‌లను ఓకే చేస్తోంది. షూటింగ్‌లతో బిజీగా ఉంటుంది. అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక రకుల్ వరుసగా క్రిష్ సినిమాతో బిజీగా ఉంది. ఓ వైపు డ్రగ్స్ కేసులో రకుల్ పేరు మార్మోగినా కూడా క్రిష్ సినిమాకు ఎలాంటి ఆటంకం రానివ్వలేదు.
చకచకా షూటింగ్‌ను పూర్తి చేసింది. తరువాత మళ్లీ బాలీవుడ్ చిత్రంతో బిజీగా అయిపోయింది. మేడే సినిమా సెట్‌లో రకుల్ అలా అడుగుపెట్టింది. రెండు మూడు రోజులకే కరోనా బారిన పడింది. దీంతో కొన్ని రోజులు విరామం తీసుకుంది. ఆ తరువాత మళ్లీ వెంటనే షూటింగ్‌లతో బిజీగా అయిపోయింది. వెంటనే మేడేలో తన పార్ట్ కంప్లీట్ చేసుకుంది. ఆ వెంటనే కోలీవుడ్ ప్రాజెక్ట్‌కు షిఫ్ట్ అయిపోయింది.

శివకార్తికేయన్ సినిమా అయలాన్ అనే చిత్రం షూటింగ్‌ను ఈ మధ్యే పూర్తి చేసేసింది. ఆ ప్రాజెక్ట్ పూర్తయిందో లేదో మరో సినిమా సెట్‌లో వాలింది రకుల్. సిద్దార్త్ మల్హోత్ర, అజయ్ దేవగణ్ కాంబోలో రాబోతోన్న థ్యాంక్ గాడ్ చిత్రంలో రకుల్ నటిస్తోందన్న సంగతి తెలిసిందే. ఇటీవలె ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాగా.. నేడు రకుల్ సెట్‌లో అడుగుపెట్టేసింది. పాత్రకు సంబంధించిన మేకప్ వేసుకుని క్యారవ్యాన్‌లో వ్యాయామం చేసేసింది.


Click it and Unblock the Notifications











