ఉల్లిపొర డ్రస్సులో రకుల్ ప్రీత్ సింగ్ అందాల ఆరబోత.. ప్రియుడితో కలిసి గ్లామర్ ట్రీట్!
టాలీవుడ్ లో దాదాపు అందరు హీరోలతో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు తన మకాం బాలీవుడ్ కి మార్చేసింది. అక్కడే ఆమె వరుస సినిమాలు చేస్తూ పేరు తెచ్చుకోవడానికి చూస్తోంది. తాజాగా ఆమె హాట్ ఫోటో ఒకటి షేర్ చేసింది. ఇంకేముంది క్షణాల్లో వైరల్ అయింది. అయితే ఆమె తాను ప్రేమిస్తున్నా అంటూ పరిచయం చేసిన ఒక వ్యక్తి చేసిన కామెంట్ ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే.

7/జి బృందావన్ కాలనీ
సెల్వ రాఘవన్ 7/జి బృందావన్ కాలనీ కన్నడ రీమేక్ తో రకుల్ సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. అయితే అప్పటికే ఆమె మోడలింగ్ చేసేది. అనుకోకుండా ఒక స్నేహితుడి కారణంగా ఈ సినిమా ఆఫర్ రావడంతో ముందు తటపటాయించినా మోడలింగ్ కి వచ్చే డబ్బు కంటే సినిమాల్లో చేస్తే వచ్చే డబ్బు ఎక్కువగా ఉంటుందని తెలియడంతో సినిమాల్లో నటించడానికి ఒప్పుకుంది.

వెంకటాద్రి ఎక్స్ప్రెస్
అలా కన్నడలో ఒక సినిమా చేసిన అనంతరం తెలుగులో కెరటం అనే సినిమాతో ఆమె పరిచయం అయింది. తమిళంలో దానినే యువన్ అనే పేరుతో రిలీజ్ చేశారు. అయినా సరే ఆమెకు మాత్రం పెద్ద గుర్తింపు ఏమీ దక్కలేదు. ఆ తర్వాత మరో రెండు తమిళ సినిమాలు చేసినా ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. కానీ తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమాలో సందీప్ కిషన్ సరసన హీరోయిన్ గా నటించడంతో ఆమె దశ తిరిగింది.

వరుస సినిమాలు
ఆ తరువాత తెలుగులో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. చివరిగా ఈ భామ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన కొండపొలం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత తెలుగులో మరో సినిమా అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతానికి చేతి నిండా హిందీ సినిమాలతో బిజీ బిజీగా ఉంది.

పెళ్లి చేసుకునే అవకాశం
ఇక రకుల్ ప్రీత్ సింగ్ మరియు జాకీ భగ్నానీ ఒకరిపై ఒకరు తమ ప్రేమను ప్రపంచానికి వ్యక్తపరిచే విషయంలో ఏమాత్రం సిగ్గుపడరు. ఆమె తన అందమైన క్రోచెట్ ష్రగ్‌లో ఫోటోను పంచుకోవడంతో, జాకీ ఆమెపై ప్రేమను కురిపించాడు. రకుల్ 31వ పుట్టినరోజున, ఆమె జాకీతో తన సంబంధాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇక వచ్చే ఏడాది రకుల్, జాకీ పెళ్లి చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
Recommended Video

ఓహ్ మై మై లవ్ అంటూ
జనవరి 20న, నటి బ్లూ క్రోచెట్ ష్రగ్‌లో డెనిమ్ షార్ట్‌లతో ఉన్న ఫోటోను వదిలింది. ఆ అద్భుతమైన చిత్రం జాకీ హృదయాన్ని కదిలించినట్లు అనిపించింది. పోస్ట్‌కు ప్రతిస్పందిస్తూ, అతను "ఓహ్ మై మై లవ్ అంటూ ఎమోజీలు కూడా షేర్ చేశాడు. జాకీ భగ్నాని విషయానికి వస్తే ఆయన ఒక నటుడు, నిర్మాత మరియు వ్యాపారవేత్త. అతను ప్రముఖ నిర్మాత వాషు భగ్నాని కుమారుడు. అంతే కాక 2009లో కల్ కిస్నే దేఖాతో అనే సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశాడు. అలాగే ఆయన బాలీవుడ్‌లో చాలా సినిమాలు చేసాడు.


Click it and Unblock the Notifications











