ఇక మిగిలింది అదే.. అడవిలో రకుల్ సందడి!!
రకుల్ ప్రీత్ ప్రస్తుతం నిత్యం ట్రెండింగ్‌లోనే ఉంటుంది. ఆ డ్రగ్స్ కేసులో రకుల్ పేరు బయటకు రావడం, ఆ వార్తలపై రకుల్ కేసులు వేయడం, ఢిల్లీ హైకోర్టు మెట్లు ఎక్కడం, డ్రగ్స్ కేసుకు రకుల్‌కు ఎలాంటి సంబంధం లేదని వార్తలు వైరల్ అవ్వడం అందరూ సారీ రకుల్ అంటూ పోస్ట్‌లు పెట్టడం అప్పట్లో తెగ వైరల్ అయింది. మళ్లీ కొన్ని రోజుకు రకుల్ పేరు డ్రగ్స్ కేసులో బయటకు వచ్చింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం రకుల్ వికారాబాద్ అడవుల్లో షూటింగ్ చేస్తూ సందడి చేస్తోంది.
రకుల్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో పని చేస్తోందన్న సంగతి తెలిసిందే. ఇందులో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ గత రెండు నెలలుగా వికారాబాద్ అడవుల్లో జరుగుతూనే ఉంది. ఇక్కడ షూటింగ్ చేస్తోన్న సమయంలోనే డ్రగ్స్ కేసులో రకుల్ పేరు వైరల్ అయింది. దీంతో వెంటనే అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లిపోయింది. మళ్లీ వెంటనే తిరిగి వచ్చింది షూటింగ్‌లో పాల్గొంది.

ఇక షూటింగ్ సెట్‌లో రకుల్ యూనిట్‌తో కలిసి తెగ సందడి చేస్తోంది. అందరూ కలిసి రకరకాల విందు భోజనాలు చేస్తూ సందడి చేస్తోంది. తాజాగా ఈ మూవికి సంబంధించిన ఓ అప్డేట్‌ను రకుల్ షేర్ చేసింది. నా డ్రీమ్ టీం, నా డ్రీమ్ రోల్ అంటూ రకుల్ తెగ సంబరపడిపోయింది. ఇక ఒకే ఒక్క సాంగ్ షూట్ మిగిలింది అంటూ అప్డేట్ ఇచ్చింది. దీంతో ఈ సినిమా షూటింగ్ పూర్తి కాబోతోన్నట్టు చెప్పకనే చెప్పేసింది.


Click it and Unblock the Notifications











