అడవుల్లో అలా, సెట్‌లో ఇలా.. రకుల్ సందడి మామూలుగా లేదు!!
రకుల్ ప్రీత్ ప్రస్తుతం అడవుల్లో తెగ కష్టాలు పడుతోంది. అది కూడా ఓ సినిమా షూటింగ్. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం ప్రస్తుతం వికారాబాద్ అడువుల్లో షూటింగ్ చేస్తోంది చిత్రయూనిట్. ఇక ఈ మూవీ షూటింగ్ అప్డేట్స్, సెట్స్‌లో సందడి గురించి రకుల్ ఇస్తోన్న అప్డేట్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నారు. ఇక అంతే కాక షూటింగ్ కోసం రకుల్ పడుతున్న పాట్లను కూడా వివరించింది.

షూటింగ్ స్పాట్‌కు చేరుకునేందుకు దగ్గరదగ్గరగా రెండు కిలో మీటర్లు ఈ అడవిలో నడవాల్సి వస్తోందని, ఇదే ఓ వర్కౌట్‌లా అవుతోందని రకుల్ తెగ బాధపడిపోయింది. అడవుల్లో షూటింగ్ కాబట్టి కాలినడక తప్పదు కదా. అందుకే రకుల్ తన నడకపై, సెట్‌లో పని జరిగే తీరుపై అలా సెటైర్ వేసింది. ఇక షూట్ అనంతం అందరూ కలిసి భోజనాలు ఆరగించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు రకుల్ చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

విందు భోజనాన్ని తలపించేలా అన్ని రకాల వంటకాలు సిద్దం చేయడంతో రకుల్ ఫుల్లుగా ఆరగించినట్టు తెలుస్తోంది. ఇలాంటి బిజీ బిజీ రోజుల్లో ఇంతకంటే మంచి ఫుడ్ మరెక్కడా ఉండదు అంటూ రకుల్ బాగానే ఆరగించినట్టు చెప్పుకొచ్చింది. ఇది దాదాపు 40 రోజుల షెడ్యూల్ అని టాక్. మొత్తానికి టాలీవుడ్‌లో షూటింగ్‌లతో సందడి నెలకొంది. చిన్న సినిమాలు, మీడియం రేంజ్ మూవీస్ సెట్స్ పైకి వెళ్తుండటంతో టాలీవుడ్ కళకళలాడుతోంది.



Click it and Unblock the Notifications











