సీక్రెట్ పెళ్లిని బయటపెట్టిన రకుల్ ప్రీత్.. అందుకే రహస్యంగా..!
తెలుగు సినిమా దగ్గర గత కొన్నేళ్ల కొన్నేళ్లు వెనక్కి వెళ్లినట్టు అయితే ఓ రేంజ్ లో తెలుగు సినిమాని ఈలేసిన టాప్ బ్యూటీలు కొంతమంది కనిపిస్తారు. చిన్న హీరోలతోనే సినిమా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్స్ లో హాట్ అండ్ బోల్డ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకామె అని చెప్పి తీరాలి.
కాగా తన ఎంట్రీ యువ హీరో ఆది సాయి కుమార్ తో ఇచ్చినప్పటికీ ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇలా ఇతర బిగ్ స్టార్స్ సరసన వరుసగా నటించేందుకు ఎక్కువ సమయం తీసుకోలేదు. ఇలా తెలుగులో వరుసగా పలు సినిమాలు చేస్తూ కొన్నేళ్ల పాటుగా నెంబర్ 1 హీరోయిన్ గా కొనసాగింది. అయితే ఈమె మళ్ళీ అక్కడ నుంచి ఫేడ్ అవుట్ అయ్యిపోవడానికి కూడా ఎక్కువ సమయం తీసుకోలేదు.

అయితే రకుల్ ప్రీత్ తెలివిగా తన స్టార్డం పడిపోతున్న సమయంలోనే కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసేసింది. నార్త్ కి చెందిన ప్రముఖ బిజినెస్ మెన్ జాకీ భగ్నానీ అనే బిజినెస్ మాగ్నెట్ ని పెళ్ళాడి సింపుల్ గా అందరికీ ట్విస్ట్ ఇచ్చింది. కాగా రకుల్ ప్రీత్ సింగ్ చేసుకున్న పెళ్లి కొంచెం హాట్ టాపిక్ గా కూడా మారింది. కాగా రకుల్ ప్రీత్ సింగ్ గత ఏడాది గోవాలో పెళ్లి చేసుకోగా తన పెళ్లి ఎలాంటి సినీ తారలు లేకుండా చేసేసుకుంది.
మాములుగా చిన్న చిన్న టెక్నీషియన్స్ అలాగే చిన్న చిన్న నటీనటులే తమకి ఉన్న పరిధి మేర పలువురు స్టార్స్ ని సైతం పిలిచి పెళ్లిళ్లు చేసుకుంటారు. కానీ అతీతంగా రకుల్ సింపుల్ గా పెళ్లి చేసేసుకుంది. దీనితో పాటుగా మరో అంశంలో కూడా రకుల్ పెళ్లి కొంచెం హాట్ టాపిక్ గా మారింది. కాగా రకుల్ పెళ్ళిలో ఎలాంటి మొబైల్ ఫోన్స్ ని అలో చేయకపోవడం అప్పుడు చర్చకి దారి తీసింది.

కాగా రకుల్ పెళ్లి ఫోటోలు లీక్ అవుతాయని ఇలా చేసింది అని పలు కామెంట్స్ సినీ వర్గాల్లో వినిపించాయి. సీక్రెట్ గా పెళ్లి చేసేసుకుంది అని అందుకే ఫోన్స్ లాంటివి అలో చేసేందుకు ఇష్టపడలేదు అంటూ పలు రూమర్స్ వచ్చాయి. కానీ ఇపుడు దీనిపై అసలు నిజాన్ని ఆమె ఓపెన్ గా చెప్పింది. కాగా రకుల్ ప్రీత్ సింగ్ ఈ రూమర్స్ పై మాట్లాడుతూ..
తాను తన పెళ్లిని చాలా సింపుల్ గా చేసుకోవాలని అనుకున్నాను అని కేవలం నా కుటుంబం స్నేహితులు మాత్రం చాలు టెక్నాలజికి దూరంగా ఉండాలని మనసుకు తేలికగా ఉంటుందనే కారణంతో మేము ఫోన్స్ ని పెళ్ళిలో వాడకూడదు అని డిసైడ్ అయ్యామని చెప్పుకొచ్చింది. సో అందులో అంతకు మించి వేరే కారణం ఏది లేదని ఆమె చెప్పేసింది. ఇక ఇవి పక్కన పెడితే రకుల్ రీసెంట్ గా భారతీయుడు 2 లో కనిపించగా నెక్స్ట్ దీని సీక్వెల్ లో కూడా కనిపించనుంది. అలాగే ఇవి కాకుండా హిందీ సినిమాలో తాను బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











