ఏకధాటిగా 30 గంటలైనా ఒకే.. నా స్టామినా అదీ.. రకుల్ ప్రీత్ సింగ్

నాలుగేళ్ల క్రితం సినీ పరిశ్రమలో అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు బాలీవుడ్‌లో కాలుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ పెద్దగా మెప్పించలేకపోయింది. ఆ తర్వాత ఐయారీ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన రకుల్ రాత మారలేదు. మరో ప్రయత్నంగా ప్రస్తుతం దే దే ప్యార్ దే సినిమాతో ఈ బ్యూటీ బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు. ఈ సినిమా మే 17న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో రకుల్ మీడియాతో మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే..

 నా దృష్టిలో సక్సెస్, ఫెయిల్యూర్స్

నా దృష్టిలో సక్సెస్, ఫెయిల్యూర్స్

సినీ పరిశ్రమలో సక్సెస్, ఫెయిల్యూర్స్ సర్వసాధారణం. యాక్టర్లుగా రాణించాలని లక్షలాది మంది కలలు కంటారు. ఎవరికో ఒకరికి మాత్రమే అలాంటి అదృష్టం దక్కుతుంది. సినీ పరిశ్రమలో నాకు దక్కిన స్థానం చూసుకొని గొప్పగా ఫీల్ అవుతాను. భగవంతుడి కృపను నేను నమ్ముతాను. జయాపజయాలు మన చేతిలో ఉండవు. విజయాలను అందుకోవడానికి జర్నీలో ఎదురయ్యే ప్రతికూలతను ఎదిరించడం నేర్చుకోవాలి అని రకుల్ ప్రీత్ అన్నారు.

 నేను కష్టపడి పనిచేయడాన్ని

నేను కష్టపడి పనిచేయడాన్ని

కష్టపడి పనిచేయడం అంటే నాకు చాలా ఇష్టం. పనిని నేను ఆస్వాదిస్తాను. వర్క్‌ను నేను ఎంతగా ఇష్టపడుతానంటే.. 30 గంటలపాటు అలుపుసొలుపు లేకుండా ఏకధాటిగా పనిచేయగలను. ప్రతిభావంతులతో పనిచేయాలని ఎప్పుడూ కోరుకొంటాను. అలాంటి వారి నుంచి కూడా ఇదే విధంగా ఆశిస్తాను. నాలో ప్రతిభను గుర్తించే వారి కోసం ఎప్పుడూ ఎదురుచూస్తుంటాను అని రకుల్ అన్నారు.

 సీనియర్లతో కలిసి నటిస్తే

సీనియర్లతో కలిసి నటిస్తే

సీనియర్ నటులతో కలిసి పనిచేయడం కెరీర్‌కు చాలా ఉపయోగపడుతుంది. వారిలోని టాలెంట్‌ను దగ్గర నుంచి చూసి తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. మనలో ఉండే లోపాలను సరిదిద్దుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. వారిని చూసి స్ఫూర్తి పొందడం జరుగుతుంది. నీ ముందు సీనియర్లు ఉంటే వారిని మెప్పించేలా నటించాలనే కోరిక కలుగుతుంది. దే దే ప్యార్ దే సినిమాలో అజయ్ దేవగన్, టబుతో కలిసి నటించడం గొప్ప అనుభవం అని రకుల్ చెప్పింది.

రొమాంటిక్ కామెడీ చిత్రం ద్వారా

రొమాంటిక్ కామెడీ చిత్రం ద్వారా

రొమాంటిక్ కామెడీ చిత్రంగా రూపొందిన దే దే ప్యార్ దే చిత్రంలో 50 ఏళ్ల వివాహితుడికి రకుల్ ప్రీత్ ప్రేయసిగా నటిస్తున్నది. అశీష్ (అజయ్ దేవగన్)కు ప్రియురాలిగా ఆయేషా (రకుల్ ప్రీత్) కనిపించబోతున్నారు. అజయ్ దేవగన్ భార్యగా టుబు మంజు పాత్రలో నటించారు. ఈ చిత్రానికి అకివ్ అలీ దర్శకత్వం వహించారు. లవర్ రంజన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మళ్లీ సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి మార్జవాన్ అనే చిత్రంలో నటిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X