దానికోసమే ఎదురుచూస్తున్నా.. అది చెప్పలేం అనుభవించాల్సిందే.. రకుల్ హాట్ కామెంట్స్
లాక్ డౌన్ పీరియడ్‌లో రకుల్ ప్రీత్ వార్తల్లో నిలిచినంతగా మరే హీరోయిన్ కూడా దరిదాపుల్లో లేదు. సోదరుడితో ఆటలు ఆడటమైనా, మెడికల్ షాపుల్లో మందులు కొనడానికి బయటకు వచ్చిన వీడియో అయినా, మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ సెన్సేషనల్ కామెంట్స్ చేయడం అయినా సరే రకుల్ స్టైలే వేరు. ఇలా రోజుకో వార్తతో రకుల్ హల్చల్ చేస్తోంది. రెండ్రోజుల క్రితం మంచు లక్ష్మీతో ఇన్‌స్టాలో లైవ్‌లోకి వచ్చింది. అక్కడా ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. తాజాగా రకుల్ చేసిన కామెంట్స్, చెప్పిన సమాధానాలు మరింత వైరల్ అవుతున్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం.

సోదరుడితో ఆటలు..
లాక్ డౌన్ కాలంలో అన్నదానం చేస్తూ సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా.. కుటుంబంతో విలువైన సమయాన్ని గడుపుతోంది రకుల్. చిన్నప్పుడు ఆడుకున్న ఆటలను మళ్లీ గుర్తు చేస్తోంది రకుల్. పులుసాట, కబడ్డీ, దిండుతో ఆటలు.. ఇలా సోదరుడి కలిసి బాగానే ఎంజాయ్ చేస్తోంది.

సింపుల్‌గా బయటకు..
ఓ సాధారణ యువతి మల్లె మెడికల్ షాపుకెల్లి మందులను కొనుక్కొని వచ్చింది. ఓ అభిమాని ఈ వీడియోను తీయగా అది తెగ వైరల్ అయింది. ఆమె ఆల్కహాల్ కొనడానికి షాప్‌కు వెళ్లిందా? అని కొన్ని వెబ్‌సైట్స్ వార్తలు రాశాయడంపై రకుల్ సెటైర్స్ వేసింది. ఓ వావ్, మెడికల్ షాపు వాళ్లు ఆల్కహాల్ అమ్ముతుంటారని నాకు తెలీదే అంటూ ట్వీట్ చేసింది.

బికినీ ధరించడంపై వ్యాఖ్యలు..
బికీనీ ధరించడం గురించి చెబుతూ.. దాని వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉందని చెప్పుకొచ్చింది. మిస్ ఇండియా కాంపిటీషన్‌కు వెళ్లమని, బికినీ ధరించమని తన తల్లే సలహా ఇచ్చిందని పేర్కొంది. బికినీకి సంబంధించి షాపింగ్ చేయడంలో తన తండ్రి సాయం చేస్తాడని తెలిపింది.
Recommended Video

చెప్పలేం అనుభవించాల్సిందే..
రకుల్ తాజాగా నెటిజన్ల ప్రశ్నకు స్పందించింది. తొలిప్రేమ గురించి చెప్పండని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. తానిప్పటివరకు ప్రేమలో పడలేదని, ప్రేమలో పడేందుకు ఎదురు చూస్తున్నానని చెప్పింది. పర్‌ఫెక్ట్ కిస్ గురించి చెప్పండని అడిగితే.. దాన్ని మాటల్లో చెప్పలేం.. అనుభవించాల్సిందేనని చెప్పింది.


Click it and Unblock the Notifications











