twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నీకు అఫైర్ లేదంటే నమ్మరు.. నాకు అబ్బాయి అయితే ఒకే.. లక్ష్మీ మంచు, రకుల్ క్రేజీ చాట్

    |

    కరోనా వ్యాప్తిని నివారించేందుకు విధించిన లాక్‌డౌన్‌ను లక్ష్మీ మంచు, రకుల్ ప్రీత్ సింగ్ తమదైన శైలిలో ఉపయోగించుకొంటున్నారు. వ్యక్తిగత వికాసం, మానసిక వికాసం లాంటి విషయాలపై దృష్టిపెడుతున్నట్టు చెప్పారు. యోగా, వ్యాయామం లాంటి వాటిని రోజు పాటిస్తున్నట్టు చెప్పారు. అలాగే టాలీవుడ్‌లో అందరూ పెళ్లిళ్లు చేసుకొంటున్నారు. కొందరు బ్రహ్మచర్యాన్ని వదిలేస్తున్నారు. నీవు ఎప్పుడు నీ నిర్ణయాన్ని చెబుతావు అనే లక్ష్మీ మంచు ప్రశ్నలకు రకుల్ సరదాగా సమాధానాలు చెప్పారు. రకుల్ చెప్పిన విషయాలు ఏమిటంటే..

    నీ వల్లనే హోమ్లీ ఫీలింగ్

    నీ వల్లనే హోమ్లీ ఫీలింగ్


    లక్ష్మీ మంచు గురించి రకుల్ చెబుతూ .. నాకు హైదరాబాద్ అంటే ఏమిటో తెలియని సమయంలో మీరు పరిచయం అయ్యారు. నాకు సొంత ఊరు అనే ఫీలింగ్ కలిగింది నీవల్లనే. నీతో కలవడం వల్ల తెలుగు మాట్లాడటం నేర్చుకొన్నాను. నాకు ఒక ఫ్యామిలీ ఉందనే ఫీలింగ్ కలిగించారు. అలాంటి పరిస్థితుల వల్లనే నేను ఎలాంటి కంగారుకు గురికాలేదు. మీ వల్లనే నాకు హైదరాబాద్ అంటే హోమ్లీ ఫీలింగ్ కలిగింది అని అన్నారు.

    అఫైర్ లేదంటే నమ్మను

    అఫైర్ లేదంటే నమ్మను

    ఇంకా నీవు సింగిల్ అని చెబితే ఎవరూ నమ్మరు. ఇంతకాలం నీవు ఎలాంటి అఫైర్ లేకుండా ఉన్నావంటే నమ్మడం కష్టం. అయితే ఇంట్లో పెళ్లిగోల ఎక్కువైందని విన్నాను. ఎవరినైనా చేసుకొనే ఆలోచన ఉందా అనే లక్ష్మీ ప్రశ్నకు రకుల్ జవాబిస్తూ నా కంటే ఎక్కువగా నీకే తెలుసు. నాకు ఎవరితోనైనా అఫైర్ ఉంటే తెలియకుండా ఉంటుందా? అని రకుల్ అన్నారు.

    నా జీవిత భాగస్వామి ఎలా ఉండాలంటే

    నా జీవిత భాగస్వామి ఎలా ఉండాలంటే


    2020లో సింగిల్ స్టేటస్‌ను అందరూ బ్రేక్ చేస్తున్నారు. నీవేమైనా పెళ్లి గురించి, కాబోయే భర్త గురించి ఆలోచిస్తున్నావా అనే లక్ష్మీ మంచు ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. పెళ్లి గురించి పెద్దగా ఆలోచనలు లేవు. ఐదేళ్ల క్రితం నా కాబోయే భర్త ఇలా ఉండాలి. అలా ఉండాలి అనే లిస్టు చాలా పెద్దగా ఉండేది. కానీ ఇప్పుడు అబ్బాయి అయి ఉంటే చాలూ అనిపిస్తున్నది అని రకుల్ చెప్పారు.

    ఏదో గొప్ప లక్ష్యంతో

    ఏదో గొప్ప లక్ష్యంతో

    కాబోయే జీవిత భాగస్వామి అంటే ఎప్పుడూ ఏదో ఒక గోల్‌తో జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచనలతో ఉండాలి. ఫ్రెండ్లీగా ఉంటూ నేచురల్‌గా ఉండాలి. పాజిటివ్ దృక్పథం కలిగి ఉండాలి. గొప్ప లక్షణాలు లేకపోయినా మంచి లైఫ్‌ను లీడ్ చేసే ఉద్దేశం కలిగి ఉండాలి అని రకుల్ తన లిస్ట్‌ను బయటపెట్టారు.

    Recommended Video

    #8YrsOfGabbarSingh: Then World Wide Box Office Collections, Now Twitter Records
    బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సు చేస్తూ..

    బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సు చేస్తూ..


    ఇక లాక్‌డౌన్ సమయంలో చాలా పుస్తకాలు చదివాను. అలాగే ఫారిన్ యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్స్ చేస్తున్నాను. దాంతో మార్కెట్‌లో ఏ జరుగుతుందనే విషయాన్ని తెలుసుకోవాలనుకొంటున్నాను. నా డబ్బు మొత్తాన్ని మా నాన్న మేనేజ్ చేస్తుంటారు. ఆయన ఎలా మేనేజ్ చేస్తున్నారనే విషయాన్ని ఆసక్తిగా గమనిస్తున్నాను అని రకుల్ చెప్పారు.

    English summary
    Rakul Preet Singh sharesabout her life partner qualities and many things in Lakshmi Manchu live Chat over the phone. Rakul said she was reading books much and doing Business management crash cource from foreign university.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X