Rakul Preet Singh పెళ్లికి సిద్దమవుతుందా? 2002లో పెళ్లి వార్తలపై కుండబద్దలు కొట్టిన రకుల్

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మొన్నటిక వరకు స్టార్ హీరోయిన్ గా చాలా బిజీ గా కనిపించిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం మాత్రం ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా మారింది. పెద్ద హీరోలతో అవకాశాలు బాగానే అందుకున్న ఈ బ్యూటీ ఒక సక్సెస్ వచ్చిన తర్వాత మళ్ళీ వరుసగా డిజాస్టర్స్ రావడంతో ఎక్కువకాలం హిట్ ట్రాక్ లో నిలువలేక పోతొంది. ఈ బ్యూటీకి ప్రస్తుతం ఎక్కువగా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో అవకాశాలు వస్తున్నాయని అర్థమవుతుంది. ఇక రీసెంట్ గా రకుల్ ప్రీత్ సింగ్ తన పెళ్లి విషయంపై మరొకసారి క్లారిటీ అయితే ఇచ్చేసింది.

బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి..

బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి..

2013లో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా ద్వారా టాలీవుడ్ లో మొదటి బాక్సాఫీస్ హిట్ అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత తెలుగు తమిళ్ అని తేడా లేకుండా తనకు నచ్చిన సినిమాల్లో నటించింది. వీలైనంత వరకు మంచి కాన్సెప్ట్ సినిమాలను మొదట్లో సెలెక్ట్ చేసుకుంది. అయితే ఆమె ఎక్కువగా ఆశలు పెట్టుకున్న కొన్ని పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

హ్యాట్రిక్ విజయాలు

హ్యాట్రిక్ విజయాలు


రకుల్ ప్రీత్ సింగ్ ఎంతో ఆశలు పెట్టుకున్న ఈ సినిమాతో పాటు రామ్ చరణ్ తేజ్ బ్రూస్ లీ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయ పాలైంది. ఇక ఆ తర్వాత వచ్చిన నాన్నకు ప్రేమతో సరైనోడు దృవ మూడు సినిమాలు కూడా హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడంతో రకుల్ ప్రీత్ సింగ్ కు ఎదురు లేదు అని అందరూ అనుకున్నారు.

మళ్ళీ డిజాస్టర్స్

మళ్ళీ డిజాస్టర్స్

ఇక ఆమె బ్యాడ్ లక్ ఏమిటో గాని స్పైడర్ సినిమా తర్వాత మళ్లీ ఎప్పటిలానే వరుసగా డిజాస్టర్స్ బాట పట్టింది. మన్మధుడు 2 అలాగే చెక్ సినిమా కూడా గత ఏడాది డిజాస్టర్ అయ్యింది. కొండపొలం సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఇక ఈ బ్యూటీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు గా కథనాలు వెలువడుతున్నాయి..

2022లో రకుల్ పెళ్లి..?

2022లో రకుల్ పెళ్లి..?

గత ఏడాది రకుల్ ప్రీత్ సింగ్ తన పుట్టినరోజు సందర్భంగా బాయ్ ఫ్రెండ్ కు సంబంధించిన ఫోటోను పోస్ట్ చేయడమే కాకుండా తను ప్రేమలో ఉన్నట్లు కూడా తేల్చేసింది. బాలీవుడ్ నిర్మాత నటుడు అయినటువంటి జాకీ భగ్నానీ ప్రేమలో ఉన్నట్లు వివరణ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ 2022 సమ్మర్ లోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు గా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.

క్లారిటీ ఇచ్చిన రకుల్

క్లారిటీ ఇచ్చిన రకుల్

అయితే ఫైనల్ గా రకుల్ ప్రస్తుతం పెళ్లి పై వస్తున్న రూమర్స్ పై తన వివరణ ఇచ్చింది. పెళ్లి అనేది తన జీవితం లో జరగబోయే అత్యంత ముఖ్యమైన ఘట్టం అని, ఒకవేళ తాను పెళ్లికి సిద్ధమైతే తప్పకుండా నేనే స్వయంగా ప్రకటిస్తాను అని తెలియజేసింది. ఇక పెళ్లి విషయంలో రూమర్స్ ఎక్కువవ్వడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని ఈ విషయంపై ఎవరు కూడా పెద్దగా పట్టించుకోకపోతేనే బావుంటుంది అని తెలియజేసింది.

Recommended Video

83 Movie Promotions : Ranveer Singh Fun With Kapil Dev And Nagarjuna | Filmibeat Telugu
ఇప్పట్లో ఆ ఆలోచన లేనట్లే..

ఇప్పట్లో ఆ ఆలోచన లేనట్లే..

ఫైనల్ గా పెళ్లి గురించి నేనే స్వయంగా చెప్పాలని అనుకుంటున్నట్లు చెప్పిన రకుల్ ఇప్పట్లో అయితే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తేల్చేసింది అంతేకాకుండా పూర్తిచేయాల్సిన ప్రాజెక్టులు కూడా చాలానే ఉన్నాయి అని వివరణ ఇచ్చింది. ఇక ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో పది సినిమాలకు పైగానే ఉన్నాయి. ఇక బాలీవుడ్ లో అజయ్ దేవగన్ తో కూడా ఒక సినిమా చేయనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X