నా గురించి తప్పుగా రాశారంటున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఆమె కష్టం చూస్తే షాకవ్వాల్సిందే!
సౌత్ సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే ఓ రేంజికి ఎదిగిన బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఇటు తెలుగు, అటు తమిళం ఇండస్ట్రీలను కవర్ చేస్తూనే హిందీలోనూ అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళుతున్నారు. అయితే గతేడాది రకుల్ నటించిన సినిమాలేవీ సౌత్‌లో రిలీజ్ కాకపోవడంతో రకుల్‌కు 2018 కలిసి రాలేదంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
తాజాగా రకుల్ నటించిన 'దేవ్' విడుదలైన నేపథ్యంలో సినిమా ప్రమోషన్లో భాగంగా ఆర్‌జె హేమంత్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె నుంచి పలు ఆసక్తికర సమాధానాలు రాబట్టారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు.

అలా లేకుంటే నాకు డబ్బులు రావు
హేమంత్ అడిగిన ఓ ప్రశ్నకు రకుల్ రియాక్ట్ అవుతూ.. ‘నాకు డబ్బులు రావాలంటే అందంగా, ఫిట్‌గా ఉండాలి. లావుగా ఉంటే అవకాశాలు ఎవరు ఇస్తారు? ఇలా ఉండటం నా ప్రొఫెషన్లో ఓ భాగమే. హెల్దీగా, ఫిట్‌నెస్‌గా ఉండటం మన లైఫ్ స్టైల్ అవ్వాలి.. ఎవరి కోసమో కాకుండా మన కోసం, మన ఆరోగ్యం కోసం అయినా దాన్ని అలవాటు చేసుకోవాలి' అన్నారు.

మీ హాబీ మీ ప్రొఫెషన్ అయితే...
మీ హాబీ మీ ప్రొఫెషన్ అయితే మీరు అలిసిపోరు.. నాకు కెమెరా ముందు నటించడం అంటే ఇష్టం. అయితే హైదరాబాద్‌కు సంవత్సర కాలంగా దూరంగా ఉండటం కాస్త బాధగా ఉంది. నాపై రకరకాల వార్తలు రావడానికి కూడా ఇది ఓ కారణం అయింది.

ఎందుకు ఇలా రాశారని బాధేసింది
గతేడాది తెలుగులో నేను నటించిన సినిమాలేవీ విడుదల కాలేదు. దీంతో చాలా మంది 2018 నాకు అన్ లక్కీ అని రాశారు. అన్ లక్కీ అని వారికి ఎవరు చెప్పారు? రోజూ షూటింగులో ఉంటున్నాను. సంవత్సరంలో 4 సినిమాలకంటే ఎక్కువగా చేయలేం. అది కూడా వివిధ భాషల్లో చేయాలి. ఎందుకు ఇలా రాస్తారు అని బాధ అనిపిస్తుంది.

మూడు ఇండస్ట్రీలు కవర్ చేస్తున్నాను
హిందీలో ఏ స్టార్ అయినా ఒక సినిమా చేసిన తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి మరో సినిమా చేస్తారు. ఎవరూ ఒకే సమయంలో రెండు మూడు సినిమాలు చేయరు. కానీ నేను ఇక్కడ తెలుగు, తమిళం, హిందీ ఇండస్ట్రీలు తిరుగుతూ ఒకే సమయంలో మల్టిపుల్ సినిమాలు చేస్తున్నాను.

ఫ్లైట్‌లోనే పడుకుంటున్నాను
కొన్నిసార్లు నిద్ర పోయే సమయంలేక ఫ్లైట్ లోనే పడుకుంటాను. ఇటీవల ముంబైలో షూటింగ్ ఉంటే వెళ్లాను. అక్కడి నుంచి దుబాయ్ వెళ్లి మరో షూటింగ్, తిరిగి ముంబై చేరుకుని, అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి దేవ్ ప్రమోషన్స్‌లో పాల్గొన్నాను. 30 గంటల్లో 4 నగరాలు తిరిగాను. ఫ్లైట్‌లో తప్ప పడుకునే సమయం ఉండటం లేదు.. అని రకుల్ తను పడుతున్న కష్టాన్ని వివరించారు.


Click it and Unblock the Notifications











