కారులో సెషన్ తర్వాత ప్యాంట్ వేసుకోలేదా? ట్రోలింగ్‌పై మళ్లీ రకుల్ ప్రీత్ గరం
అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్‌కు ట్రోలింగ్ గతేడాది తీవ్రస్థాయిలో జరిగింది. ఓ ఫోటోషూట్‌ను ఉద్దేశించి సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెను ఊచకోత కోయడం బాధించిందని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. కొందరు నకిలీ అకౌంట్లతో నన్ను టార్గెట్ చేయడం చాలా దారుణమని వాపోయింది. తనపై వస్తున్న ట్రోలింగ్ గురించి మాట్లాడుతూ..

ప్యాంట్ జిప్ పెట్టుకోకపోవడంపై
నేను బ్లూ బ్రూలెట్, జీన్స్ వేసుకొని తీసిన ఫోటోషూట్‌లో ప్యాంట్ బటన్ పెట్టుకోకపోవడంపై నెటిజన్లు దారుణంగా కామెంట్లు చేశారు. రియల్ ఐడెంటిటీ లేకుండా సోషల్ మీడియాలో నాపై చీప్‌గా కామెంట్లు పెట్టారు. వెరిఫైడ్ అకౌంట్లకు ఉన్న విలువ వారికి తెలియదు. అలాంటి వారి అకౌంట్లను పరిశీలించాల్సిన అవసరం ఉంది అంటూ రకుల్ అభిప్రాయపడ్డారు.

ప్యాంట్ వేసుకోలేదా అంటూ
గతేడాదిలోనే రకుల్ మరోసారి దారుణమైన ట్రోలింగ్ బారిన పడింది. ప్యాంట్ వేసుకోకుండా కారులో నుంచి దిగడంపై ఓ నెటిజన్ పెట్టిన కామెంట్ అత్యంత వివాదంగా మారింది. కారులో సెషన్ తర్వాత ప్యాంట్ వేసుకోవడం మరిచావా? అంటూ నెటిజన్ చేసిన వ్యాఖ్యలకు బదులిస్తూ.. కారులో నీ అమ్మ చాలా సెషన్స్ జరిపి ఉంటుంది. అందుకే నీవు అంత ఎక్స్‌పర్ట్‌లా మాట్లాడుతున్నావు అంటూ రకుల్ చేసిన కామెంట్లు దుమారం లేపాయి.

అలా సహనం కోల్పోతాను
తనను ఉద్దేశించిన చేసిన కామెంట్లపై, తాను చేసిన కామెంట్లపై రకుల్ ప్రీత్ స్పందిస్తూ.. కొన్నిసార్లు ఎదుటి వ్యక్తి చేసే దాడుల వల్ల సహనం కోల్పోతాం. అలాంటి వారు ఉన్నంతకాలం మహిళలకు రక్షణ కరువు అవుతుంది. మహిళ భద్రత, సమానత్వం కేవలం డిబేట్‌లకే పరిమితం అవుతుంది.

నన్నే ఎందుకు ప్రశ్నిస్తారు
నాపై ట్రోలింగ్ జరిగినప్పుడు నేను చేసిన కామెంట్లనే ఎందుకు పరిగణనలోకి తీసుకొంటారు. నా విలువనే ఎందుకు ప్రశ్నిస్తారు. మహిళను టార్గెట్ చేశారనే విషయంపై ఎందుకు మాట్లాడరు? కారులో సెషన్ అంటూ కామెంట్ చూస్తే ఎవరైనా సహనంతో ఉంటారా? అలాంటి జవాబు ఇవ్వకుండా నియత్రించుకోవడం సులభమా? అంటూ రకుల్ ప్రీత్ ప్రశ్నల వర్షం కురిపించారు.
Recommended Video

ప్రపంచమంతా ద్వేషం నిండి ఉంది
సోషల్ మీడియాలోనే కాదు ప్రపంచంలోనే మహిళలపై అత్యంత ప్రతికూల ప్రవర్తన, ద్వేషం నిండి ఉంది. అలాంటి సమాజ పరిస్తితుల విషయంలో ఎవరు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉందనే నిర్ణయానికి వచ్చాను. ఆరోగ్యకరమైన విమర్శను నేను ఎప్పుడు స్వాగతిస్తాను. కానీ టార్గెట్ చేస్తూ విమర్శిస్తే వ్యక్తిగతంగాను, మానసికంగాను దెబ్బ తింటాను అని రకుల్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











