ఆ మూడింటితోనే జీవితం.. అది సమస్యే కాదు.. రకుల్ ప్రీత్ సింగ్
కెరీర్‌లో సరైన హిట్టు లేకపోయినా బ్రహ్మండంగా అవకాశాలు అంది పుచ్చుకోవడంలో రకుల్ ప్రీత్ సింగ్ దిట్ట. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస చిత్రాలతో మోత మోగిస్తున్నది. ఆమె నటించిన తమిళ చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. అలాగే హిందీలో దే దే ప్యార్ దే చిత్రం మే నెలలో రిలీజ్ రెడీ అయింది.
ఇప్పటికే దే దే ప్యార్ దే సినిమాకు సంబంధించిన ట్రైలర్, టీజర్లు కేక పెట్టిస్తున్నాయి. హాట్ హాట్ సీన్లలో ప్రేక్షకులను మత్తెక్కిస్తున్నది. తాజాగా రిలీజైన ఈ చిత్రానికి సంబంధించిన పాట రిలీజై వైరల్‌గా మారింది. ఇలా వరుసగా పలు భాషల్లో ఎలా నటించగలుగుతున్నారనే ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది.

మంచి కథలు ఏ భాషలో ఉంటే అక్కడ నటించడానికి నేను రెడీ. మూడు భాషలను మేనేజ్ చేయడం నాకు పెద్ద సమస్య కాదు. ఇష్టపడి పని చేస్తున్నప్పుడు దానిని ఆస్వాదించడం తప్ప సమస్యగా భావించను. మన డ్రీమ్స్‌కు అనుగుణంగా ప్రయాణించాల్సి ఉంటుంది. ఫిల్మ్, ఫుడ్, ఫిట్ నెస్ నా జీవితంలో ఓ భాగం. నా ఫ్యూచర్ కూడా ఈ మూడు రంగాలతో ముడిపడి ఉంటుంది అని రకుల్ చెప్పింది. ప్రస్తుతం నాగార్జునతో కలిసి మన్మథుడు2 చిత్రంలో నటిస్తున్నది. ఈ సినిమా షూటింగ్ గ్రీస్‌లో జరుగుతున్నది.


Click it and Unblock the Notifications











