బాలీవుడ్ ఇండస్ట్రీలో రకుల్ మరో బిగ్ బడ్జెట్ మూవీ.. ఈసారి మరింత భారీగా..
మొన్నటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా స్టార్ హీరోయిన్ గా కనిపించిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీలో గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. తెలుగులో గత కొంతకాలంగా వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో మాత్రం సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా అవకాశాలను అందుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ బ్యూటీ చేసిన కొన్ని సినిమాలు బాక్సాఫీసు వద్ద మీడియం రేంజ్ లో సక్సెస్ అయినప్పటికీ కూడా ఆమెకి పై ఎలాంటి ప్రభావం చూపలేదు అని చెప్పాలి. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ లేడీ ఓరియంటెడ్ అవకాశాలు కూడా వస్తున్నాయి.
ఇటీవల ఈ బ్యూటీ ఒక ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ లో భారీ బడ్జెట్ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఒక డిఫరెంట్ లేడి ఓరియెంటెడ్ సినిమాను దక్కించుకున్నట్లు కూడా సమాచారం. రకుల్ ప్రీత్ సింగ్ గత కొంత కాలంగా తెలుగులో అయితే వరుసగా పరాజయాలని ఎదుర్కొంటోంది చివరగా 2017లో నాగచైతన్య రారండోయ్ వేడుక చూద్దాం సినిమా తర్వాత ఆమె మరొక సక్సెస్ చూడలేదు. ఎన్ని సినిమాలు చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాలను అందుకుంటున్నాయి. ముఖ్యంగా స్పైడర్ సినిమా తర్వాత ఆమే స్థాయి చాలవరకూ తగ్గిపోయింది అని చెప్పాలి.

అంతే కాకుండా నాగార్జున తో చేసిన మన్మధుడు 2 సినిమా కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చేలా చేసింది. ఇక ఈ బ్యూటీ చివరగా తెలుగులో నితిన్ తో చెక్ సినిమా చేసింది. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో అయితే 10 సినిమాలు ఉన్నాయి. ఇక అందులో ఏడు సినిమాలు ఈ ఏడాది విడుదల కాబోతుండడం విశేషం. అందులో ఎక్కువగా బాలీవుడ్ సినిమాలు చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల మరో సినిమా చేసేందుకు కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
అది కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమానే అని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. దినేష్ జైన్ నిర్మాత కొత్త దర్శకుడు తో చేయబోయే ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ నటించబోతున్నట్లు సమాచారం. ఆ సినిమా కోసం భారీ స్థాయిలో పారితోషికం కూడా ఇస్తున్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. ఏదేమైనా కూడా రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరుస పరాజయాలను చూసినప్పటికీ కూడా బాలీవుడ్లో మాత్రం భారీ స్థాయిలో అవకాశాలు అందుకుంటోంది. ఇక ప్రస్తుతం దాదాపు పది సినిమాలకు పైగా చేస్తోంది. ఇక అందులో ఎటాక్, రన్ వె 34, డాక్టర్ జి, థాంక్ గాడ్, ఛత్రి వాలి, ఇండియన్ 2 వంటి సినిమాలు కూడా ఉన్నాయి ఇందులో ఏ సినిమా సక్సెస్ అయినా కూడా ఈ బ్యూటీకి మరిన్ని అవకాశాలు వచ్చినట్లే అని చెప్పవచ్చు. మరి రాబోయే రోజుల్లో రకుల్ ఇంకా ఏ రేంజ్ లో అవకాశాలు అందుకుంటుందో చూడాలి


Click it and Unblock the Notifications











