twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్రేజీగా రకుల్ బర్త్ డే.. ఎవరితో.. ఎక్కడ గడిపిందంటే..

    |

    టాలీవుడ్‌లో అందం, అభినయంతో ఆకట్టుకొంటున్న బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తన జన్మదినాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ఈ ఏడాది ఆమె 29 ఏళ్లు పూర్తి చేసుకొని 30 పడిలోకి ప్రవేశించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తనదైన శైలిలో రాణిస్తున్న ఈ అందాల భామ తన పుట్టిన రోజును ఈ సారి డిఫరెంట్‌గా జరుపుకొన్నారు. ఆమె ఎవరితో, ఎక్కడ పుట్టిన రోజును జరుపుకొన్నారంటే..

    రకుల్ ఫిట్‌నెస్‌ గురించి

    రకుల్ ఫిట్‌నెస్‌ గురించి

    రకుల్ అనగానే మనకు గుర్తొచ్చేది ఫిట్‌నెస్. ఆరోగ్యంపై శ్రద్ధపెట్టడమే కాకుండా.. ఫిట్‌నెస్ సెంటర్లు పెట్టి హెల్త్‌పై అవగాహన కలిగిస్తున్నారు. ఫిట్‌నెస్ సెంటర్లను పలు ప్రాంతాల్లో నెలకొల్పి వ్యాపారరంగంలోకి ప్రవేశించారు. అలాంటి రకుల్ వెకేషన్‌కు వెళ్లినా తన ఫిట్‌నెస్‌ ప్రొగ్రాంను మరిచిపోలేదు. థాయ్‌లాండ్ పుకెట్‌లో యోగాసనం వేసిన ఫోటోను అభిమానులతో పంచుకొన్నారు.

    తల్లిదండ్రులతో రకుల్

    తల్లిదండ్రులతో రకుల్

    నిబద్దతకు, డెడికేషన్‌కు కట్టుబడి ఉండే రకుల్ ఈ సారి కాస్త వర్క్‌కు బ్రేక్ ఇచ్చి థాయ్‌లాండ్‌కు వెళ్లారు. పుకెట్‌లోని విలాసవంతమైన ప్రాంతంలో తన తల్లిదండ్రులతో కలిసి బర్త్ డేను ఘనంగా జరుపుకొన్నారు. తన తల్లిదండ్రులతో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేశారు.

    బాయ్‌ఫెండ్‌తో ఉండాలి

    బాయ్‌ఫెండ్‌తో ఉండాలి

    ఇక టాలీవుడ్‌లో అత్యంత సన్నిహితురాలైన మంచు లక్ష్మీ కొత్త తరహాలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాదైనా బాయ్‌ఫెండ్‌ను చూసుకో అని మంచు లక్ష్మీ ఇన్స్‌టాగ్రామ్‌లో కామెంట్ పెట్టారు. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా మంచి సినిమాలతో ఆలరించాలని సూచించారు. మంచు లక్ష్మీ ట్వీట్‌పై స్పందిస్తూ.. నా జీవితంలో ఎంతో మంచి చేసుంటే నాకు నీలాంటి ఫ్రెండ్ దొరికిందనుకొంటాను. ఇంకా నేను సాధించాల్సింది చాలా ఉంది. ఆ తర్వాత జీవిత భాగస్వామి గురించి ఆలోచిస్తాను అని సమాధానం ఇచ్చారు.

    Recommended Video

    Rakul Preet Singh Bikini Photos Going Viral
    రకుల్‌కు రానా విషెస్

    రకుల్‌కు రానా విషెస్

    ఇక రకుల్ పుట్టిన రోజును పురస్కరించుకొని సోషల్ మీడియాలో విషెష్ ప్రవాహం భారీగా కొనసాగింది. కాజల్ అగర్వాల్, తమన్నా, రానా దగ్గుబాటి తదితరులు విషెస్ అందజేశారు. కెరీర్ పరంగా దే దే ప్యార్ దే సినిమాతో హిట్టు అందుకొన్న రకుల్.. తాజాగా మన్మథుడు 2 సినిమా డిజాస్టర్‌తో నిరాశకు లోనయ్యారు.

    English summary
    Actress Rakul Preet Singh Birthday celebrations in Phuket of Thailand. She spent quality time with her parents in Phuket. She shared adorable photos in the Social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X