బాలీవుడ్ వివాదంలో వేలుపెట్టిన రకుల్ ప్రీత్.. భగ్గుమంటున్న విషయాన్ని కెలుకుతూ..
బాలీవుడ్‌తోనే కెరీర్ ఆరంభించిన రకుల్ ప్రీత్ సింగ్‌కు దక్షిణాది సినీ పరిశ్రమనే అదృష్టాన్ని పంచింది. వరుస విజయాలతోపాటు స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను సౌత్ ఇండస్ట్రీ ఇచ్చింది. అయితే ఇటీవల కాలంలో దక్షిణాది సినిమాలకు దూరమవుతూ బాలీవుడ్ చిత్రాలపై కన్నేసింది. ఇటీవల కాలంలో హిందీ సినిమా పరిశ్రమకు సంబంధించిన వాళ్లు (ఇన్‌సైడర్స్), ఇండస్ట్రీకి సంబంధం లేని ఫ్యామిలీ (అవుట్ సైడర్) అనే విషయంపై రెండు చిలీపోయారు. ఈ విషయం భారీ చర్చ జరుగుతున్న సమయంలో జాతీయ మీడియాతో మాట్లాడుతూ..

బాలీవుడ్‌లో వివాదంపై రకుల్ ప్రీత్
ప్రస్తుతం బాలీవుడ్‌లో బంధుప్రీతి, ఫేవరిటిజం, గ్రూపిజం లాంటి చర్చ ఎప్పటి నుంచో జరుగుతున్నది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఈ చర్చ విపరీతంగా జరుగుతున్నది. ఇప్పుడు బాలీవుడ్‌లో ఇన్‌సైడర్ వర్సెస్ అవుట్‌సైడర్‌గా మారింది. ఈ విషయంపై రకుల్ ప్రీత్ సింగ్ స్పందిస్తూ.. ఇండస్ట్రీలో ఎవరు ఉండాలి.. ఎవరు ఉండకూడదనేది ప్రేక్షకులే నిర్ణయిస్తారు అని అన్నారు.

టాలెంటే కాపాడుతుందని
కెరీర్‌లో ఎవరికైనా ఎదురు దెబ్బ తగిలినప్పుడు వాటిన తట్టుకొని నిలబడటానికి మరింత కష్టపడాలి. ప్రతీ విషయంలో కూడా సానుకూల దృక్పథం ఉండాలి. ఎలాంటి సమయంలోనే కష్టపడి పనిచేయడం మరిచిపోవద్దు. అవుట్ సైడర్, ఇన్ సైడర్ అనేది కాకుండా టాలెంటే చివరికి విజయ తీరాలకు చేరుస్తుంది అని రకుల్ తెలిపారు.

సినీ పరిశ్రమ అంటేనే అనిశ్చితి
సినిమా పరిశ్రమలో అనిశ్చితి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చెప్పలేం. అయితే ఎలాంటి సమస్యలు ఎదురైనప్పటీకి వాటిని ధైర్యంతో తట్టుకోవాలి. చివరకు కష్టపడే తీరు, పనిపట్ల అంకితభావం నీకు ఆఫర్లను, విజయాలను అందిస్తుంది అని రకుల్ ప్రీత్ చెప్పుకొచ్చారు.
Recommended Video

రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ గురించి
రకుల్ కెరీర్ విషయానికి వస్తే గతేడాది దే దే ప్యార్ దే సినిమాతో బాలీవుడ్‌లో తొలి విజయాన్ని అందుకొన్నారు. తాజా కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, ప్రియా భవానీ శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Click it and Unblock the Notifications