ఏదో ఒక రోజు ఆయనతో.. విజయ్ దేవరకొండపై రకుల్ హాట్ కామెంట్
హిట్లు, ఫట్లు అనే సంబంధం లేకుండా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండపై విపరీతమైన క్రేజ్ కొనసాగుతున్నది. ఈ క్రేజ్ కేవలం ప్రేక్షకులకే పరిమితం కాలేదు. సినీ హీరోయిన్లు కూడా విజయ్ పేరు చెప్పినా.. ఆయన యాటిట్యూబ్ చూసినా ఫిదా అవుతున్నారు. ఇప్పటికే జాన్వీ కపూర్ నుంచి కొత్తగా వస్తున్న హీరోయిన్ల వరకు విజయ్ దేవరకొండతో నటించాలని ఉత్సాహం పడుతున్నారు. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ఆ జాబితాలో చేరిపోయింది. వివరాల్లోకి వెళితే..

హిందీ, దక్షిణాది సినిమాల్లో
రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ చిత్రాలను బ్యాలెన్స్ చేసుకుంటూ తన కెరీర్‌ను చక్కదిద్దుకొంటున్నది. హిందీలో ఆమె నటించిన దే దే ప్యార్ దే చిత్రంలో హాట్ హాట్‌గా నటించి ఆకట్టుకొన్నది. పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించడానికి సిద్ధమవుతున్నది.

కరోనావైరస్‌పై రకుల్ ప్రీత్ సింగ్
కరోనావైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందడంపై రకుల్ స్పందిస్తూ.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి సంక్షోభంలో ప్రతీ ఒక్కరు స్వచ్ఛందంగా ఆరోగ్య సూచనలు, సలహాలు పాటించాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో ప్రభుత్వాలకు అండగా నిలువాలి అని రకుల్ సూచించారు.

విజయ దేవరకొండతో నటించాలని
తాజాగా బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండతో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. మా ఇద్దరి జోడి వెండితెర మీద హాట్ జోడిగా మారడం ఖాయం. నిర్మాతలు మా ఇద్దరితో ఓ సినిమా చేస్తే నటించడానికి నేను రెడీ అని రకుల్ పేర్కొన్నారు.

విజయ్ దేవరకొండ బార్న్ టు బి స్టార్
విజయ్ దేవరకొండ సహజ నటుడు. నటించడానికే పుట్టినట్టు కనిపిస్తాడు. బార్న్ టు బి స్టార్ అంటూ విజయ్ దేవరకొండపై రకుల్ ప్రశంసలు కురిపించారు. విజయ్ దేవరకొండ భవిష్యత్‌లో మంచి నటుడిగా పేరు తెచ్చుకొంటారు అని రకుల్ జోస్యం చెప్పారు. ఎలాంటి పాత్రలోనైనా ఆయన ఒదిగిపోతాడు అని కితాబు ఇచ్చారు.
Recommended Video

ఫైటర్ సినిమాలో
ఇక విజయ్ దేవరకొండ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. బాలీవుడ్ తార అనన్యపాండే హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కరొనావైరస్ కారణంగా ఫైటర్ చిత్రం వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











