ఏడేళ్ల బంధం.. సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ ఎమోషనల్.. వివాదాల మధ్య లేఖ వైరల్
అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ తన కెరీర్‌లో మరో మైలురాయిని చేరుకొన్నారు. టాలీవుడ్‌లో అడుగుపెట్టి ఏడేళ్లు పూర్తి కావడంతో ఆనందం మునిగి తేలుతూ తన ఇన్స్‌టాగ్రామ్‌లో భావోద్వేగమైన లేఖను రాశారు. ఇటీవల కాలంలో అనేక వివాదాల్లో కూరుకుపోయిన రకుల్ ప్రీత్ మళ్లీ తేరుకొని షూటింగులతో బిజీగా మారిపోయారు. ఇక రకుల్ ప్రీత్ లేఖ విషయానికి వస్తే..

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో
రకుల్ ప్రీత్ సింగ్ తన కెరీర్‌ను కన్నడ సినీ పరిశ్రమతో ప్రారంభించింది. సిద్ధార్థ్ రాజ్‌కుమార్‌తో కలిసి కెరటం అనే చిత్రంతో తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత సందీప్ కిషన్‌తో కలిసి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో నటించడం ద్వారా తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. నవంబర్ 29వ తేదీకి ఆమె టాలీవుడ్‌లో ప్రవేశించి ఏడు సంవత్సరాలు కావడంతో భావోద్వేగానికి గురయ్యారు.

పక్కా తెలుగు అమ్మాయిగా ఆదరించి
టాలీవుడ్‌లో అడుగుపెట్టి ఏడేళ్లు పూర్తయ్యాయి. ఆ విషయాన్ని తలచుకొంటే పెదవి మీద చిరునవ్వు పొంగుకొస్తున్నది. ఢిల్లీ అమ్మాయిగా పరిచయమైనప్పటికీ.. పక్కా తెలుగు అమ్మాయిగా నన్ను ఆదరించడమే కాకుండా ప్రేక్షకులనాపై అభిమానాన్ని కురిపించారు. నా జర్నీ అద్భుతమైనది అంటూ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు.

మీరంతా నాకు బలంగా
నా కెరీర్ గొప్పగా సాగడం, నన్ను టాప్ హీరోయిన్‌గా ప్రేక్షకులు గుర్తించడం వెనుక ఎంతో మంది సహకారం ఉంది. నా కెరీర్‌లో భాగమైన దర్శకులు, నిర్మాతలు, నా సహనటులు, స్నేహితులు, అభిమానులకు నా ధన్యవాదాలు. నా ప్రతీ అడుగులో నన్ను పోత్సహిస్తూ.. అవసరమైతే విమర్శిస్తూ నాకు అండగా నిలిచినందుకు రుణపడి ఉంటాను. నా కుటుంబం, నా మేనేజర్, టీమ్ లేకపోతే నాకీ గౌరవం లభించేది కాదని నేను బలంగా నమ్ముతాను అని రకుల్ ప్రీత్ లేఖలో తెలిపారు.

రకుల్ టాలీవుడ్ కెరీర్
టాలీవుడ్‌లో కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల నాగార్జున అక్కినేనితో కలిసి రకుల్ ప్రీత్ నటించిన తెలుగు చిత్రం మన్మథుడు 2. ప్రస్తుతం నితిన్‌తో కలిసి చెక్ అనే చిత్రంలో నటిస్తున్నారు. 2021లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది. అలాగే క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో కూడా విభిన్నమైన పాత్రను పోషిస్తున్నది.

రకుల్ ప్రీత్ బాలీవుడ్ కెరీర్
ఇక బాలీవుడ్ కెరీర్ విషయానికి వస్తే.. చేతి నిండా ప్రాజెక్టులు ఉన్నాయి. హిందీలో ఎటాక్, అయాల్‌యాన్, సర్దార్ అండ్ గ్రాండ్‌సన్, మేడే చిత్రాల్లో నటిస్తున్నారు. తమిళంలో కమల్ హాసన్‌తో కలిసి ఇండియన్ 2లో కనిపించనున్నారు. ఇంకా పలు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











