రకుల్ ప్రీత్ ఇంట్లో డ్రగ్స్ స్వాధీనం?... అవి నావి కావు.. రియా చక్రవర్తివే అంటూ వెల్లడి

బాలీవుడ్‌తో డ్రగ్స్ రాకెట్ సంబంధాలపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ సప్లయర్లతో సినీ తారల లింకులపై ఆరా తీస్తున్నారు. తమ దర్యాప్తులో భాగంగా రియా చక్రవర్తి, ఆమె టాలెంట్ మేనేజర్ జయా సాహాను విచారించే క్రమంలో బయటపడిన వాట్సాప్ చాట్స్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి. వాట్సాప్ ఛాట్స్ లీకుల ద్వారా రకుల్ ప్రీత్ సింగ్, దీపిక పదుకోన్, సారా ఆలీ ఖాన్, శ్రద్దాకపూర్‌కు సమన్లు జారీ చేశారు. ఎన్సీబీ దర్యాప్తులో భాగంగా విచారణకు హాజరైన రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడించిన విషయాలు ఇవే...

Recommended Video

Rakul Preet Singh : చాట్ చేసింది నిజమే.. కానీ నేను మత్తు పదార్థాలు తీసుకోలేదు! - రకుల్
నాలుగు గంటలపాటు ప్రశ్నించిన ఎన్సీబీ

నాలుగు గంటలపాటు ప్రశ్నించిన ఎన్సీబీ

డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ శుక్రవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో దక్షిణ ముంబైలోని ఎన్సీబీ గెస్ట్‌హౌజ్‌లో విచారణకు హాజరయ్యారు. దాదాపు 4 గంటలపాటు రకుల్‌ను అధికారులు పలు రకాల ప్రశ్నలతో సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించినట్టు తెలిసింది.

రకుల్ ఇంట్లో డ్రగ్స్ లభ్యం?

రకుల్ ఇంట్లో డ్రగ్స్ లభ్యం?

డ్రగ్స్ సమకూర్చుకొన్న విషయంపై రకుల్‌ను ప్రశ్నించగా.. తన ఇంట్లో లభ్యమైన డ్రగ్స్ తనవి కావు. రియా చక్రవర్తివి అని వెల్లడించినట్టు సమాచారం. గురువారం నార్కోటిక్స్ అధికారులు జరిపిన సోదాల్లో రకుల్ ఇంట్లో ఎక్కువ మోతాదులో డ్రగ్స్ లభ్యమైనట్టు ఇండియాటుడే, రిపబ్లిక్ ఛానెల్స్ తమ కథనాల్లో ప్రచురించాయి.

ఆ డ్రగ్స్ రియా చక్రవర్తివే

ఆ డ్రగ్స్ రియా చక్రవర్తివే


ఇదిలా ఉండగా, తన నివాసంలో లభ్యమైన డ్రగ్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదు. ఆ డ్రగ్స్ రియా చక్రవర్తికి సంబంధించినవని చెప్పగా.. డ్రగ్స్ గురించి చేసిన చాటింగ్స్ బయటపెట్టగా చివరకు వాటిని అంగీకరించినట్టు రిపబ్లిక్ టెలివిజన్ కథనాన్ని ప్రసారం చేసింది. డ్రగ్స్ డెలివరీకి తన ఇంటిని వాడుకొన్నట్టు విచారణలో రకుల్ ప్రీత్ చెప్పినట్టు సమాచారం. విచారణ సందర్భంగా దీపిక పదుకోన్ మేనేజర్ కరిష్మా ప్రకాశ్‌ను, రకుల్‌ను కలిపి ప్రశ్నించినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో పాల్గొన్నా.. నాకు అలవాటు లేదు

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో పాల్గొన్నా.. నాకు అలవాటు లేదు

అయితే అధికారుల విచారణ సందర్భంగా రకుల్ స్పందిస్తూ.. నాకు డ్రగ్స్ వాడే అలవాటు లేదు. డ్రగ్స్ ఎప్పుడూ కొనలేదు. వాటిని సమకూర్చలేదు. యాంటీ డ్రగ్స్ ప్రచారంలో చాలాసార్లు స్వయంగా పాల్గొన్నాను. నాకు డ్రగ్స్ సప్లయర్లతో సంబంధాలు లేవు అని రకుల్ చెప్పినట్టు జాతీయ టెలివిజన్ ఛానెల్స్ కథనాలను ప్రసారం చేశాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X