For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నీ తల్లి అలాంటిదేనా? రకుల్ వ్యాఖ్యలపై భగ్గుమన్న నెటిజన్లు... చెంప చెల్లుమనే కౌంటర్!

  |

  టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తనపై భగత్ అనే వ్యక్తి ట్విట్టర్లో చేసిన అసభ్య కామెంట్స్‌కు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు. అయితే అతడికి కౌంటర్ ఇచ్చే క్రమంలో ఆ వ్యక్తి తల్లిని ఉద్దేశిస్తూ ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి.

  అతడు తప్పు చేస్తే... తల్లిని కూడా ఇందులోకి లాగి కించపరచడం సరికాదు అంటూ కొందరు రకుల్ తీరును తప్పుబట్టారు. అయితే తన కామెంటును తప్పుబట్టిన వారికి రకుల్ ఏమాత్రం తగ్గకుండా కౌంటర్ ఇచ్చారు. అసలు ఈ గొడవ ఏమిటో ఓలుక్కేద్దాం....

  ఆ ఫోటోపై కామెంట్ చేయడంతో

  ఆ ఫోటోపై కామెంట్ చేయడంతో

  రకుల్ ప్రీత్ చిట్టి పొట్టి షార్ట్ ధరించిన హాట్ ఫోటో ఒకటి పోస్టు చేసింది. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.... ‘కారులో సెషన్ అయిపోయిన తర్వాత రకుల్ ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయింది' అంటూ కామెంట్ పెట్టాడు. కారులో రకుల్ తప్పుడు పని చేసిందని అర్థం వచ్చేలా ఈ కామెంట్ ఉండటంతో ఆమె తీవ్ర ఆగ్రహానికి గురైంది.

  నీ తల్లి అలాంటిదేనా?

  నీ తల్లి అలాంటిదేనా?

  నీ తల్లి కూడా కారులో ఇలాంటి సెషన్స్ చాలా చేసి ఉంటుంది. ఇలాంటి సెషన్స్ గురించి మాత్రమే కాదు.. కాస్త బుద్ది కూడా నేర్చించమని ఆమెను అడుగు. మనుషులు ఇలాంటి మైండ్ సెట్‌తో ఉన్నంతసేపు మహిళలకు రక్షణ ఉండదు. కేవలం మహిళలకు సమానత్వం, రక్షణ గురించి డిబేట్లు పెట్టినంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం ఉండదు, వారి మైండ్ సెట్ మారాలి అంటూ రకుల్ ఫైర్ అయ్యారు.

  రకుల్ మీద భగ్గుమన్న నెటిజన్లు

  రకుల్ మీద భగ్గుమన్న నెటిజన్లు

  అయితే రకుల్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యలపై కొందరు నెటిజన్లు భగ్గుమన్నారు. అతడి తిట్టు ఫర్వాలేదు... కానీ తల్లి ఏం పాపం చేసింది? ఆమెను ఇందులోకి లాగి నీచమైన కామెంట్స్ చేయడం ఎందుకు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  అప్పుడు మీరంతా ఎక్కడికి వెళ్లారు? రకుల్ కౌంటర్

  అప్పుడు మీరంతా ఎక్కడికి వెళ్లారు? రకుల్ కౌంటర్

  నా నైతిక విలువల గురించి ప్రశ్నిస్తున్న వారు... ఒక ఆడకూతురు గురించి అసభ్యంగా మాట్లాడున్నపుడు ప్రశ్నించకుండా ఎక్కడికి వెళ్లారు? అలాంటి నీచమైన బుద్ది ఉన్నవారికి నా స్టైల్‌లో బుద్ది చెప్పాలనుకున్నాను. వారికి ఫ్యామిలీ ఉంటుంది... వారిపై కామెంట్స్ చేస్తే ఆ పెయిన్ ఏమిటో అర్థ అవుతుంది. విషయం అతడి తల్లి వరకు వెళితే తప్ప కుండా చెంప చెల్లుమనిపిస్తుంది అని రకుల్ తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు.

  ఈ ఫోటోల వల్లే...

  ఈ ఫోటోల వల్లే...

  రకుల్ కారులో దిగుతూ వేసుకున్న మోడ్రన్ డ్రెస్సు ఇదే. ఆమె ధరించిన షార్ట్ చాలా కురచగా ఉండటం, టాప్ జాకెట్ కూడా అదే కలర్ ఉండటంతో చూసే వారికి... అంతా ఒకే డ్రెస్సులా కనిపిస్తోంది. సడెన్‌గా చూస్తే ప్యాంట్ వేసుకోలేదనే భావన కలుగుతోంది.

  మీ అభిప్రాయం ఏమిటి?

  మీ అభిప్రాయం ఏమిటి?

  రకుల్ డ్రెస్సింగ్ మీద అసభ్య కామెంట్ చేయడం ముమ్మాటికీ తప్పే. మహిళల వస్త్రధారణను తప్పుబట్టే హక్కు ఎవరికీ లేదు. అయితే రకుల్ అతడి తల్లిని కూడా తిట్టడం ఇక్కడ వివాదానికి కారణమైంది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ బాక్సులో వెల్లడించండి.

  సినిమాలు

  సినిమాలు

  రకుల్ నటిస్తున్న సినిమాల విషయానికొస్తే... ఈ ఏడాది ఆమె వసరుగా తమిళ చిత్రాలు చేస్తున్నారు. సూర్యతో ఎన్.జి.కె, కార్తితో దేవ్, శివకార్తికేయ్ మూవీలో, హిందీలో రెండు ప్రాజెక్టులు, తెలుగులో వెంకీ మామ అనే చిత్రంలో నటిస్తోంది.

  English summary
  "Well for people questioning my ethics why don’t you speak up when women are objectified and I’ve chosen my words only to make such #sickminds realise that they have a family too and how would they feel if the same is done to them ! I am sure his mother would give him a slap too." Rakul Preet singh tweeted.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X