వాళ్లు మనుషులేనా? డబ్బులిచ్చి మరీ ఇంత దారుణమా?
అందాల భామ రకుల్ ప్రిత్ సింగ్ (Rakul Preet Singh)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'కెరటం'తో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన రకుల్, తొలి సినిమాతోనే తన నటనతో మెప్పించి క్రమంగా స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, లక్యం, సరైనోడు, నాన్నకు ప్రేమతో, ధ్రువ వంటి వరుస విజయాలతో టాప్ హీరోయిన్ గా మారింది. రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజ వంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసి 'లక్కీ చామ్'గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే, గత కొన్ని ఏండ్లుగా ఫెయిల్యూర్ ట్రాక్ లో నడుస్తుంది. తాజాగా రకుల్ ప్రిత్ సింగ్ ఓ కీలక అంశంపై బహిరంగంగా మాట్లాడి చర్చను రేపింది. ఇంతకీ ఆ అంశమేంటీ?
బాలీవుడ్‌లో ఏదో ఒక అంశం తరచూ చర్చనీయాంశమవుతూనే ఉంటుంది. ఒక దశలో నెపోటిజంపై నడిచిన చర్చలు, ఆ తర్వాత వర్కింగ్ అవర్స్‌పై వచ్చిన వాదనలు ఇప్పుడు పీఆర్ (Public Relations) వ్యవస్థపై వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. బాలీవుడ్ లో పీఆర్ వ్యూహాలు హద్దులు దాటుతున్నాయనే అభిప్రాయం వెల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో నటి రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పబ్లిసిటీ, పీఆర్ సంస్కృతిపై స్పష్టంగా మాట్లాడారు.

ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ పీఆర్ వ్యవస్థలు ఒక స్థాయి వరకే పనిచేస్తాయని, నిజమైన విజయం మాత్రం కష్టపడి చేసిన పనివల్లే వస్తుందని నొక్కిచెప్పారు. 'గతంతో పోలిస్తే బాలీవుడ్‌లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కొందరు డబ్బులు చెల్లించి మరీ ఇతరులపై నెగెటివిటీని ప్రచారం చేస్తున్నారు. ఇంతలా బురద చల్లే వాళ్లకు నిద్ర ఎలా పడుతుంది? వాళ్లకు మనస్సాక్షి ఉండదా? వాళ్లు మనుషులేనా? అని అనిపిస్తుంది. ఇలాంటి ధోరణులు ఎప్పటికైనా తిరిగి దెబ్బతీస్తాయి' అంటూ రకూల్ షాకింగ్ కామెంట్స్ చేసింది. 'కొంచెం పీఆర్ అవసరం ఉండొచ్చు. కానీ ఇతరులను బురదలో లాగడానికి డబ్బులు ఖర్చు పెట్టడం ఎంత నెగటివ్? అలా చేసి మీరు ఎలా నిద్రపోతారు?'అంటూ రకుల్ ఘాటు ప్రశ్నలు సంధించారు.
తన కెరీర్ ప్రయాణం గురించి కూడా రకుల్ స్పష్టత ఇచ్చారు. 'నేను ఎవరి సాయం లేకుండా, నా కష్టంతోనే ఈ స్థాయికి వచ్చాను. అందుకే నాకు ప్రత్యేకంగా పీఆర్ అవసరం లేదని భావిస్తాను. పని మాట్లాడితే అదే గుర్తింపు తెస్తుంది' అని చెప్పారు. తన దృష్టిలో మంచి పని తానే మాట్లాడుతుందనీ, కర్మకు ఫలితం తప్పక వస్తుందనే నమ్మకం ఉందని చెప్పింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతూ, ఇండస్ట్రీలో కొనసాగుతున్న పీఆర్ ప్రాక్టీసులపై చర్చను మళ్లీ రగిలించాయి.
ఇక ఫొటోగ్రాఫర్లు (పాపరాజీ) వ్యవహారంపై కూడా రకుల్ అసహనం వ్యక్తం చేశారు. తాను ఒకే జీన్స్‌ను నెలలో ఐదు సార్లు వేసుకుంటానని, దాన్నికూడా ఫొటోగ్రాఫర్లు గమనించి ప్రశ్నించడం సరికాదని అన్నారు. 'నేను దుస్తులకు అధిక ప్రాధాన్యం ఇవ్వను. ప్రతి సారి బయటికి వెళ్లేటప్పుడు కొత్తగా రెడీ అవ్వాల్సిందే అనే ఒత్తిడి అవసరం లేదు. వ్యక్తిగత హద్దులు ఉండాలి' అంటూ ఆమె వ్యాఖ్యానించారు. 'పని మాట్లాడాలి, ప్రచారం కాదు' అన్న ఆమె అభిప్రాయం ప్రస్తుతం సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ పెద్ద చర్చకు దారి తీస్తోంది.
ఇదిలా ఉంటే.. టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బాలీవుడ్‌లోనూ తన స్థానం సంపాదించుకుంది. ఇటీవల ఆమె దే దే ప్యార్ దే 2 లో కనిపించింది. మిక్స్డ్ టాక్ వచ్చినా, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 105 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. ముందుగా పతీ,పత్నీ ఔర్ వోలో నటించనుండగా, శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 3 లోనూ ఆమె భాగమవుతోంది. అలాగే నితీష్ తివారి దర్శకత్వంలోని రామయణలో శూర్పణఖ పాత్రలో రకుల్ కనిపించనుండటం విశేషం. ఈ ఎపిక్ దీపావళి 2026కి విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











