Rakul Preet Singh: బ్లాక్ డ్రెస్ లో రెచ్చిపోయిన రకుల్... ఆమె హాట్ షోపై హస్బెండ్ షాకింగ్ కామెంట్
పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ లో రెచ్చిపోయి మరీ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఆమె హాట్ ఫోటోలు చూసిన తర్వాత రకుల్ భర్త చేసిన కామెంట్ షాకింగ్ గా మారింది. ఇంతకీ రకుల్ భర్త కంగనా ఫోటోలపై ఎలా రియాక్ట్ అయ్యాడు అనే విషయంపై ఓ లుక్కేద్దాం.
ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ తన నెక్స్ట్ యాక్షన్ డ్రామా మూవీ ఇండియన్ 2 రిలీజ్ కు రెడీ అవుతుంది. రీసెంట్ గా చెన్నైలో జరిగిన ఈ మూవీ గ్రాండ్ ఆడియో లాంచ్ ఈవెంట్లో రకుల్ ప్రీత్ సింగ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ సందర్భంగా ఆమె ఒక అద్భుతమైన బ్లాక్ సీక్వెన్స్ చీరను, ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ను ధరించి సున్నితమైన ఆభరణాలతో మరింత స్టైల్ గా కనిపించింది.

అలాగే కొద్దిపాటి మేకప్ తో తన లుక్ ను కంప్లీట్ చేసింది. ఈ హాట్ అండ్ గ్లామర్ ఫోటోలను రకుల్ ప్రీత్ సింగ్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి అభిమానులకు ట్రీట్ ఇచ్చింది. దీంతో రకుల్ ఫ్యాన్స్ పెళ్లయిన తర్వాత ఈ బ్యూటీ మరింత హాట్ గా మారింది అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే అందరికంటే ఆమె భర్త చేసిన కామెంట్ ఇంట్రెస్టింగ్ గా మారింది.
రకుల్ ప్రీత్ సింగ్ ఆ ఫోటోలను షేర్ చేస్తూ దేర్ ఈజ్ నో సచ్ థింగ్ యాజ్ టూ మచ్ బ్లాక్ అంటూ క్యాప్షన్ రాసింది. ఆమె ఆ ఫోటోలను ఇలా పోస్ట్ చేసిందో లేదో వెంటనే ఆమె భర్త జాకీ భగ్నాని కామెంట్ సెక్షన్ కి వెళ్లి ఓ మై గాడ్ అని రిప్లై ఇచ్చాడు. మొత్తానికి ప్రస్తుతం రకుల్ ఫోటోలపై ఆయన భర్త స్పందించడం అనేది హాట్ టాపిక్ గా మారింది. కాగా ఇండియన్ 2 ఆడియో లాంచ్ ఈవెంట్లో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, నెల్సన్ తో పాటు హీరోయిన్ కాజల్ అగర్వాల్ తో సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
ఇక రకుల్ ప్రీత్ సింగ్, జాకీ మధ్య ప్రేమ లాక్ డౌన్ సమయంలో వికసించింది. ఇద్దరూ కలిసి ఇంట్లో ఎక్కువ సమయం గడపడంతో వారి మధ్య అప్పటిదాకా ఉన్న స్నేహం మరింత బలపడి ప్రేమగా మారింది. 2021 లో ఈ జంట సోషల్ మీడియాలో తమ రిలేషన్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక కొన్నేళ్లపాటు డేటింగ్ చేసిన తర్వాత ఏడాది ఫిబ్రవరి 21న గోవాలో పెళ్లి చేసుకున్నారు.
ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో పెద్దగా సినిమాలేమీ లేవు. పాన్ ఇండియా మూవీ ఇండియన్ 2లో కీలకపాత్ర పోషిస్తుంది రకుల్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏ మూవీలో కమల్ హాసన్ హీరోగా నటిస్తుండగా కాజల్ అగర్వాల్, సిద్ధార్థ, ప్రియా భవాని శంకర్ లతోపాటు రకుల్ ప్రీత్ సింగ్ కూడా కీలకపాత్రను పోషిస్తుంది. ఈ సినిమాతో పాటు మేరే హస్బెండ్ కి బీవీ అనే సినిమాలో నటించబోతోంది రకుల్. ఈ రొమాంటిక్ డ్రామాకు రకుల్ భర్త జాకీ భగ్నాని నిర్మాత కావడం విశేషం.


Click it and Unblock the Notifications











