ప్రియుడితో కలిసి పబ్లిక్ ప్లేస్ లో రకుల్ ప్రీత్ హాల్ చల్.. వీడియో వైరల్

రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల కాలంలో వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. హాట్ గ్లామరస్ ఫొటోలతో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా బయట ప్రపంచంలో కూడా బాగానే చక్కర్లు కొడుతోంది. ఇక బాయ్ ఫ్రెండ్ తో కూడా రకుల్ ఈ మధ్య బాగానే కనిపిస్తోంది. ఆమె సడన్ గా పబ్లిక్ ప్లేస్ లలో కనిపిస్తూ ఉండడంతో ఒక్కసారిగా జనాలు సెల్ఫీలు తీసుకునేందుకు ఆశపడుతున్నారు. ఇక రీసెంట్ గా తాజ్ మహల్ దగ్గర కూడా రకుల్ తన బాయ్ ఫ్రెండ్ తో కనిపించింది. కానీ ఈసారి ఎలాంటి ఇబ్బంది లేకుండా భారీగా సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఆ వివరాల్లోకి వెళితే..

 బాలీవుడ్ పైనే ఫోకస్

బాలీవుడ్ పైనే ఫోకస్

టాలీవుడ్ లో గ్లామరస్ బ్యూటీ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్ మొన్నటివరకు తెలుగు సినిమాలతో చాలా బిజీగా కనిపించేది. కానీ ఆమెకు గతంలో మాదిరిగా తెలుగులో సక్సెస్ లు అంతగా రావడం లేదు. దీంతో పూర్తిగా బాలీవుడ్ ఇండస్ట్రీ పైన ఫోకస్ చేసింది. ఇక అక్కడ ఈ బ్యూటీకి చాలా అదృష్టం లభించింది అని చెప్పాలి.. అక్కడ సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా చాలా మంచి అవకాశాలు అందుకుంటోంది.

వరుసగ రెండు సినిమాలు ప్లాప్

వరుసగ రెండు సినిమాలు ప్లాప్


గత ఏడాది తెలుగులో రకుల్ ప్రీత్ సింగ్ 2 సినిమాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. మొదట నితిన్ చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్లో వచ్చిన చెక్ సినిమాలో ఒక లాయర్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందేమ్ కానీ ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని అందుకుంది. అనంతరం క్రిష్ వరుణ్ తేజ కాంబినేషన్ లో వచ్చిన కొండపోలం సినిమా కూడా తేడా కొట్టేసింది.

 ఈ ఎడాది తొమ్మిది సినిమాలు

ఈ ఎడాది తొమ్మిది సినిమాలు


ఇక తెలుగులో ఈ బ్యూటీకి సరిగ్గా విజయాలు దక్కక పోయినప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం మంచి అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం రకుల్ చేతిలో అయితే తొమ్మిది సినిమాలకు పైగానే ఉన్నాయి. ఈ ఏడాది వరుసగా తొమ్మిది సినిమాలు విడుదల కాబోతున్నాయి అంటూ రకుల్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది.

బాయ్ ఫ్రెండ్ తో..


రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రేమ విషయం లో కూడా ఓపెన్ గా వివరన ఇచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత జాకీ బద్నానీతో గత కొంత కాలంగా డేటింగ్ చేస్తోంది. కొన్ని రోజుల వరకు ఈ విషయాన్ని చాలా సీక్రెట్ గానే ఉంచారు. ఇక గత ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా అమ్మడు అఫీషియల్ గా ప్రకటించింది.

Recommended Video

83 Movie Promotions : Ranveer Singh Fun With Kapil Dev And Nagarjuna | Filmibeat Telugu
తాజ్ మహల్ దగ్గర రకుల్..

తాజ్ మహల్ దగ్గర రకుల్..


గత ఏడాది చివర్లోనే వారు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ పెళ్లికి ఇంకా చాలా సమయం ఉంది అనే రకుల్ ఒక క్లారిటీ ఇచ్చింది. ఇక వీరి ప్రేమ జీవితాన్ని మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల తాజ్ మహల్ కి వెళ్ళిన రకుల్ ప్రీత్ సింగ్ పబ్లిక్ ప్లేస్ లో చాలా హ్యాపీగా తిరిగింది. ఇక ఆమెతో ఫోటోలు దిగేందుకు ఫ్యాన్స్ కోసం కూడా ఎగబడ్డారు. ఇక రకుల్ తన బాయ్ ఫ్రెండ్ తో అక్కడ చాలా హ్యాపీగా తాజ్ మహల్ చుట్టూ తిరిగింది. అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X