క్రికెట్ స్టేడియంలో రకుల్ రచ్చ.. దే దే సిక్స్ దే అంటూ ఫుల్ ఎంజాయ్
నిన్న (ఆదివారం) జరిగిన భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ లో చాలా మంది సెలెబ్రిటీలు ఎంజాయ్ చేశారు. టాలీవుడ్, బాలీవుడ్ నుంచి మాంచెస్టర్ కి క్యూ కట్టిన సెలెబ్రెటీలకు తమ అద్భుతమైన ఆటతీరుతో స్పెషల్ ట్రీట్ ఇచ్చారు భారత క్రికెట్ ప్లేయర్స్. పాకిస్థాన్ పై విజయకేతనం ఎగరేసి దేశం లోని క్రికెట్ అభిమానులందరిలో ఉత్సాహం నింపారు.

మాంచెస్టర్ లో జరిగిన ఈ అద్భుతమైన మ్యాచ్ చూసి ఫుల్లుగా ఎంజాయ్ చేసింది పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. తన స్నేహితులతో కలిసి యూకే వెళ్లిన ఈ భామ మాంచెస్టర్ స్టేడియంలో చేసిన హంగామా అంతా ఇంతా అని చెప్పలేం. భారత ఆటగాళ్ల జోష్ చూస్తూ దే దే సిక్స్ దే అని అరుస్తూ ప్లకార్డులు ప్రదర్శించింది రకుల్. స్టేడియంలో ప్రేక్షకుల మధ్య సందడి చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసిన నెటిజన్స్ రకుల్ లాంటి అందాల భామల మధ్యలో భారత ఆటగాళ్లు రెచ్చిపోయి పర్‌ఫార్మ్ చేశారంటూ కామెంట్లు పెడుతున్నారు.
రకుల్ తో పాటుగా మంచు లక్ష్మి, రామ్ చరణ్ సతీమణి ఉపాసన సైతం మాంచెస్టర్ లో జరిగిన ఈ మ్యాచ్ చూసి ఎంజాయ్ చేశారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో భారత బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీ చేసి కనువిందు చేశాడు. ప్రపంచ కప్ టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై భారత విజయం, అందునా సెలెబ్రిటీల సందడి చూసి మురిసిపోతున్నారు తెలుగు ప్రేక్షకులు.
ఇక రకుల్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే అజయ్ దేవగన్ సరసన దే దే ప్యార్ దే సినిమాలో యమ హాట్ గా దర్శనమిచ్చి బాలీవుడ్ జనాన్ని బుట్టలో వేసుకుంది. ప్రస్తుతం నాగార్జున సరసన మన్మథుడు 2 చిత్రంలో నటిస్తోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున, రకుల్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ హైలైట్ కానున్నాయని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











