500 రూపాయలు నేర్పిన గుణపాఠం.. రకుల్‌ను మార్చేసిన సంఘటన ఏంటంటే?
తెలుగు సినిమా దగ్గర వచ్చిన కొంత సమయంలోనే మంచి స్టార్ స్టేటస్ తెచ్చుకున్న యువ హీరోయిన్స్ చాలా మందే ఉంటారు. అయితే అలా వచ్చి ఫేమస్ అయ్యిన చాలా మందిలో ఎంతో కాలం ఇండస్ట్రీలో నిలిచిన వారు కూడా లేరు. అలా ఉన్న కొన్నేళ్లు కూడా స్టార్స్ తో సినిమాలు చేసేసి ఉన్న కొంత కాలంలోనే బాగా సంపాదించేసుకున్న టాప్ హీరోయిన్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకామె అని చెప్పొచ్చు.
కాగా రకుల్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడం చిన్న హీరోలతోనే వచ్చినప్పటికీ ఆ కొన్ని సినిమాలతోనే మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్స్ తో సినిమాలు చేసే ఛాన్స్ ని కొట్టేసింది. ఇలా తెలుగు సహా తమిళ్ లో కూడా పలు సినిమాలు ఆమె వెంటవెంటనే చేసింది. అయితే తర్వాత మాత్రం రకుల్ ఫేడ్ అవుట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది.

ఒక్క సినిమా కూడా వర్క్ కాకపోవడంతో మళ్ళీ ఆమె హిందీ సినిమా లోకే వెళ్ళిపోయింది. అక్కడ కూడా పెద్దగా సక్సెస్ లు లేవు ఇక తెలుగులో అయితే దాదాపు కనుమరుగు కూడా అయ్యిపోయింది. కానీ తర్వాత ఆమె పెళ్లి చేసేసుకొని సెటిల్ అయ్యిపోయింది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి చక్కర్లు కొడుతోంది. ఇటీవల దేశ వ్యాప్తంగా దీపావళి పండుగ జరుపుకున్న సంగతి తెలిసిందే.
కాగా ఈ పండుగకి సంబందించే ఇపుడు రకుల్ పై ఆసక్తికర విషయం వినిపిస్తుంది. కాగా రకుల్ లైఫ్ లో ఒక ఇన్సిడెంట్ తర్వాత అక్కడ నుంచి దీపావళి చేసుకోవడం మానేసిందట. అయితే రకుల్ తండ్రి ఆమె దీపావళి చేసుకుంటున్న సమయంలో ఆమె తండ్రి తాను చూస్తుండగానే 500 రూపాయల నోటు కాల్చడం చూసి ఎందుకు అని అడిగితే ఇదే డబ్బులతో మీరు దీపావళి క్రాకర్స్ కొని కలుస్తున్నారు కదా దాని వల్లే ఎంతో కాలుష్యం జరుగుతుంది అలాంటప్పుడు దీనికి దానికి పెద్ద తేడా ఏముంది అని ఆమెకి చెప్పాడట.

దీంతో ఆ ఒక్క ఇన్సిడెంట్ నుంచి ఆమె అక్కడ నుంచి దీపావళి చేసుకోవడం మానేసిందట. దీనితో ఈమె విషయంలో ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇపుడు వైరల్ అయ్యింది. అయితే దీనిపై కూడా కొన్ని నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇది వేరే విషయం. కాగా రకుల్ అయితే తెలుగులో ప్రస్తుతం ఎలాంటి సినిమాలు చేయడం లేదు కానీ..ఈ ఏడాదిలో మాత్రం తమిళ్ లో హీరో శివ కార్తికేయన్ తో అయలాన్ అలాగే అదే తమిళ్ లో కమల్ హాసన్, సిద్ధార్థ్ శంకర్ ల భారీ పాన్ ఇండియా సినిమా ఇండియన్ 2 లో కనిపించింది.
కానీ ఈ రెండు సినిమాలు కూడా పెద్ద సక్సెస్ సాధించలేదు. కాగా నెక్స్ట్ కూడా ఇండియన్ 3 లో అయితే ఆమె మళ్ళీ కనిపించనుంది కానీ ఈ సినిమా ఎప్పుడు విడుదల అనేది సస్పెన్స్ గానే ఉంది. కాగా ఈ భారీ సినిమా మినహా సౌత్ సినిమా దగ్గర రకుల్ చేతిలో ఎలాంటి ఆఫర్స్ లేనట్టే తెలుస్తుంది. ఇక సౌత్ మినహా ఇపుడు రకుల్ హిందీ సినిమాలోనే అరకొర సినిమాలు చేస్తూ తన పర్శనల్ లైఫ్ లో బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











