పనీ పాట లేనోళ్ళు వేసే వేషాలే ఇవి.. దురదృష్టకరం.. రకుల్‌ప్రీత్ సింగ్

సోషల్ మీడియా వేగంగా విస్తరిస్తుండటంతో సెలెబ్రిటీలు, సాధారణ జనం మధ్య దూరం చాలా వరకు తగ్గిపోయింది. నెట్టింట సమయం స్పెండ్ చేసే జనం పెరగటంతో పాటు అదే నెట్టింట తమ హాట్ ఫొటోలతో గాలం వేసే హీరోయిన్లు పెరిగిపోయారు. అయితే హీరోయిన్లు పెడుతున్న కొన్ని ఫొటోలు చర్చలకు దారితీస్తూ సదరు హీరోయిన్లను ట్రోల్స్ బారిన పడేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఇబ్బందిని తీవ్రంగా ఎదుర్కొంటున్న హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు.

Rakul Preet Singh Fires On Trollings In Social Media

ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని పిక్స్‌పై.. పొట్టి దుస్తులు వేసుకుందని, అసలు దుస్తులే వేసుకోలేదని రకరకాలుగా కామెంట్స్ చేశారు నెటిజన్లు. అయితే ఆ కామెంట్స్‌పై వెంటనే దిమ్మతిరిగే కౌంటర్ వేస్తూ ఫైర్ అయినా రకుల్..తాజాగా మరోసారి ట్రోలింగ్ అనే అంశంపై స్పందించింది. దేశంలో పనీ పాట లేని వారు బాగా పెరిగిపోయారని, ఎదుటి ట్రోల్స్ చేయడమే వారు పెద్ద పనిగా పెట్టుకున్నారని రకుల్ అంటోంది. దానికి తోడు ఫ్రీ డేటా, ఫ్రీ ఇంటర్‌నెట్ లాంటి సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో ఎదుటివారికి తిట్టడమే ఎవరికి పెద్ద పనిగా మారిందని పేర్కొంటూ రకుల్ ఫైర్ అయింది.

తాను వేసుకుంటున్న దుస్తులు, సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టుల పట్ల.. తనకు, తన కుటుంబానికి, తన స్నేహితులకు లేని అభ్యంతరం ఇతరులకు ఎందుకు వస్తోందో అర్థం కావడంలేదని రకుల్ ప్రీత్ చెప్పుకొచ్చింది. అందుకే నెగెటివ్ కామెంట్స్ తాను పెద్దగా పట్టించుకోనని రకుల్ తెలిపింది. ఇక ఇటీవలే బాలీవుడ్ తెరపై కూడా తన అందాలకు పదును పెట్టిన రకుల్ ఇటీవలే 'దే దే ప్యార్ దే' సినిమా ద్వారా అలరించింది. ప్రస్తుతం 'హౌస్ ఫుల్ 4' సినిమాలో నటిస్తోంది.

ఇక రకుల్ తెలుగు సినిమాల విషయానికొస్తే.. సీనియర్ హీరో నాగార్జున సరసన మన్మథుడు 2 చిత్రంలో నటిస్తోంది రకుల్. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో జరుగుతోంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X