హోటల్‌లో 10 మందితో రకుల్.. బిల్లు చూసి దిమ్మతిరిగింది!
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జోరు సినిమాల పరంగా ఈ మధ్య కాస్త తగ్గింది. రకుల్ ప్రీత్ క్రేజ్ కు తగ్గ హిట్లు పడడం లేదు. అయినా కూడా రకుల్ కు మంచి అవకాశాలే దక్కుతున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ లండన్ లోని ఓ స్టార్ హోటల్ లో ఇటీవల తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరించింది. తన 10 మంది స్నేహితులకు పార్టీ ఇచ్చేందుకు హోటల్ కు వెళ్లిందట. అక్కడ తన స్నేహితులు, ఆమె కలసి మంచి వంటకాలన్నీ ఆరగించారు.
కేవలం 10 మంది మాత్రమే ఉన్నాము. కానీ బిల్లు చూతే నా మతిపోయినంత పని అయింది. బిల్లు అక్షరాలా 10 లక్షలు అయింది. ఆ షాక్ నుంచి నేను కాసేపు కోలుకోలేక పోయాను. ఇక చేసేది లేక 10 లక్షలు హోటల్ వాళ్లకు సమర్పించుకుని తిరిగి వచ్చాను. ఇక జీవితంలో ఆ హోటల్ వైపు వెళ్లకూడదని ఒట్టు పెట్టుకున్నా అని రకుల్ అంటోంది.

సాధారణంగా సినీతారల లైఫ్ స్టైల్ విలాసవంతంగా ఉంటుంది. అధిక మొత్తంలో తారలు డబ్బు ఖర్చు చేస్తుంటారు. కానీ 10 మంది కలసి విందు ఆరగించినందుకే 10 లక్షలు అంటే దిమ్మ తిరిగే విషయమే. రకుల్ ప్రీత్ సింగ్ నటించిన దేవ్ చిత్రం గురువారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రకుల్ ప్రస్తుతం మరికొన్ని తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











