twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ రూమర్స్ నిజం కాదు.. నచ్చిన వాడితోనే రకుల్ పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన తల్లి!

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో కథానాయికగా తనకంటూ ఒక గ్లామర్ ఇమేజ్ సంపాదించుకున్న బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. అవకాశాలు తగ్గినా కూడా అమ్మడు తన గ్లామర్ షోతో తన అభిమానులను సరికొత్తగా ఎట్రాక్ట్ చేస్తోంది. ఈ మధ్య కాలంలో రకుల్ ఫోటోస్ బాగా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ బ్యూటీ పెళ్లిపై ఇటీవల అనేక రకాల వార్తలు వచ్చాయి. ఆ రూమర్స్ పై రకుల్ తల్లిగారు వివరణ ఇచ్చారు.

     ఊహించని డిజాస్టర్స్..

    ఊహించని డిజాస్టర్స్..

    రకుల్ ప్రీత్ సింగ్ దురదృష్టం ఏమిటో గాని మంచి అవకాశాలు దొరికాయని సంబరపడుతున్న సమయంలోనే ఊహించని విదంగా స్టార్ హీరోలతో నటించిన సినిమాలే డిజాస్టర్ అవుతున్నాయి. ఎలాంటి సినిమా చేసిన కూడా ఊహించని విధంగా అపజయాలు ఎదురవుతున్నాయి. స్టార్ హీరోలతో ఛాన్సులు రాగానే ఒక్కసారిగా రెమ్యునరేషన్ డోస్ పెంచినట్లు వార్తలు కూడా వచ్చాయి.

     స్పైడర్ దెబ్బకు..

    స్పైడర్ దెబ్బకు..

    రకుల్ చివరగా 2017లో రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో సక్సెస్ అందుకుంది. ఆ తరువాత ఒక్కసారి కూడా సక్సెస్ అందుకోలేదు. ముఖ్యంగా స్పైడర్, మన్మథుడు 2 సినిమాలు కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపించాయనే చెప్పాలి. ఆ సినిమాల్లో కేవలం స్టార్ హీరోలు ఉన్నారనే కారణంగా ఒప్పుకున్న రకుల్ తన పాత్రల గురించి ఎక్కువగా ఆలోచించలేకపోయింది. అందుకే ఆ క్యారెక్టర్స్ పై ఎక్కువగా ట్రోల్స్ వచ్చాయి..

    పెళ్లిపై పుకార్లు..

    పెళ్లిపై పుకార్లు..

    ఇక కెరీర్ లో సరైన సక్సెస్ లు లేక రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలకు ఎండ్ కార్డ్ పెడుతున్నట్లు గతంలో చాలా వార్తలు వచ్చాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని ఆ తరువాత రకుల్ పలుమార్లు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అలాగే ఆమె ఒక కుర్ర హీరోతో ప్రేమలో ఉన్నట్లు కూడా సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి వాటిని ఈ బ్యూటీ పెద్దగా పట్టించుకోలేదు.

    క్లారిటీ ఇచ్చిన రకుల్ మదర్..

    క్లారిటీ ఇచ్చిన రకుల్ మదర్..

    ఇక రకుల్ ప్రీత్ సింగ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందని ఆమె కుటుంబ సభ్యులు ఒక యువకుడిని ఆమె కోసం సెలెక్ట్ చేసి ఉంచారని వార్తలు రాగా.. ఫైనల్ గా రకుల్ తల్లి తన కూతురి పెళ్లిపై వివరణ ఇచ్చారు. ఇప్పట్లో రకుల్ పెళ్లి చేసుకునే అవకాశం లేదని, తన మనసుకు ఎవరైతే నచ్చుతారో అప్పుడు తన ఇష్ట ప్రకారమే అనుకూలంగా ఉన్న సమయంలోనే రకుల్ పెళ్లి చేసుకుంటుందని అన్నారు. అలాగే పెళ్లిపై వస్తున్న రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని చెబుతూ.. రకుల్ ప్రస్తుతం తన కెరీర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తోందని ఈ హీరోయిన్ తల్లి వివరణ ఇచ్చారు

    English summary
    Hot beauty Rakul Preet Singh is a glamour image in the Tollywood industry. Even though the chances are low, she is getting a lot of new fans with its glamour show. Rakul photos are going viral in the meantime. If not, there have been many news recently on this beauty wedding. Rukul's mother gave an explanation on the rumors.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X