twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మస్తు కిక్కెక్కించే రకుల్ ప్రీత్ డ్రింక్.. కరోనాను ఎదుర్కొనే కొత్త పానీయం ఇదే

    |

    అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ అందం, ఆరోగ్యం విషయంలో చాలా పక్కాగా వ్యవహరిస్తారు. కాలం ఏదైనా, పరిస్థితులు ఎలా ఉన్న ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. అంతేకాకుండా అందం, ఆరోగ్యం కోసం చక్కటి చిట్కాలు పాటిస్తారు. తాజా కరోనావైరస్ ముప్పు పొంచి ఉన్న సమయంలో దానికి విరుగుడుగా ఓ పానీయాన్ని అభిమానులకు, ప్రజలకు సూచిస్తున్నారు. రకుల్ తయారు చేసిన ఆ డ్రింక్ ఏమింటంటే..

    లాక్‌డౌన్ పిరియడ్‌లో

    లాక్‌డౌన్ పిరియడ్‌లో

    మార్కెట్‌లో ఎన్ని రకాల హెల్త్, ఎనర్జీ డ్రింకులు ఉన్న సహజ సిద్ధంగా తయారు చేసుకొనే పానీయాలే ఆరోగ్యానికి రక్ష అని పెద్దలు చెబుతుంటారు. ప్రస్తుతం లాక్‌డౌన్ పిరియడ్‌లో ఇంటికే పరిమితమైన రకుల్ నేచురల్‌గా ఉండే పానీయాన్ని తయారు చేసుకొని చిట్కాను తన ఇన్స్‌టాగ్రామ్‌లో చెప్పారు.

     రోగ నిరోధక శక్తిని పెంచే

    రోగ నిరోధక శక్తిని పెంచే

    ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో రోగ నిరోధక శక్తిగా ఉండే పదార్థాలను, పానీయాలను సేవించాలి. నాకు నా ఫ్రెండ్ రాశీ చౌదరీ ఈ డ్రింక్ తయారు చేసుకొనే విధానాన్ని చెప్పింది. అందుకు థ్యాంక్స్. ప్రస్తుత పరిస్థితులకే కాకుండా ఎప్పుడూ ఇలాంటి పానీయం సేవిస్తే ఆరోగ్యం చక్కగా ఉంటుంది అని వెల్లడించారు.

    డ్రింక్ తయారీ విధానం, కావాల్సిన వస్తువులు

    డ్రింక్ తయారీ విధానం, కావాల్సిన వస్తువులు

    అరోగ్యాన్ని కాపాడే సహజ సిద్ధమైన పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు ఇవే అంటూ రకుల్ తెలిపారు. 500 మిల్లీ లీటర్ల నీళ్లు, అందులోకి సరిపోయేంత అల్లం, మిరియాలు, పసుపు, లవంగాలు, దాల్చిన చెక్క పాత్రలో వేసుకొని మరగబెట్టుకోవాలి. ఆ ద్రావణ మిశ్రమం సగం అయ్యేంత వరకు మరగబెట్టాలి. దానికి ఆర్గానిక్ తేనే కలిపి తాగితే కెఫిన్ ఉండే కాఫీ కంటే మంచి రుచిని కలిగి ఉంటుంది అని రకుల్ చెప్పారు.

    సహజ సిద్ధంగా ఉండే పదార్థాలను

    సహజ సిద్ధంగా ఉండే పదార్థాలను

    ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనే విధంగా ఆరోగ్యాన్ని పరీరక్షించుకోవాలి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. ఎప్పుడు ఆరోగ్యం, శారీరక పటుత్వంపై దృష్టిపెట్టాలి. మానసిక, శారీరకంగా ఆరోగ్యాన్ని దృఢంగా ఉంచుకోవాలి. ఇంట్లో తయారు చేసుకొనే ఫుడ్‌ను, ఇతర వస్తువులను వినియోగించుకోవాలి అని రకుల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

    Recommended Video

    Sri Reddy Comments On Amala Paul About Bhavninder Singh
    రకుల్ ప్రీత్ కెరీర్ గురించి

    రకుల్ ప్రీత్ కెరీర్ గురించి


    రకుల్ ప్రతీ కెరీర్ విషయానికి వస్తే.. బాలీవుడ్‌లో షిమ్లా మిర్చి, జాన్ అబ్రహంతో ఎటాక్, అజయ్ దేవగన్‌తో థ్యాంక్స్ గాడ్, తమిళంలో శివకార్తికేయన్‌తో ఆయాలన్, కమల్ హాసన్‌తో ఇండియన్ 2 చిత్రాల్లో నటిస్తున్నారు. తెలుగులో చివరిగా మన్మథుడు 2లో నటించారు.

    English summary
    Tollywood and Bollywood star Rakul Preet Singh health and fitness tips amid Corona Crisis. He gave tips about a recipe in her instagram that, Add pinch of ginger , pepper , turmeric , cinnamon and cloves to 500 ml water.. let it boil till it becomes half. Add organic honey if you like.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X